దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండియా వైడ్ ఫేమ్ ఉన్న పబ్లిక్ పెర్సనాలిటీ. టాప్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ లో ఆయన ఒకరు. సరికొత్త ఫిల్మ్ మేకింగ్ తో ట్రెండ్ సెట్టర్ గా పేరు తెచ్చుకున్నారు. రామ్ గోపాల్ వర్మ డెబ్యూ మూవీ శివ ఒక సంచలనం. టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా ఉంది.
వర్మ తెరకెక్కించిన సత్య, రంగీలా, సర్కార్ బాలీవుడ్ ని షేక్ చేశాయి. అయితే ఇదంతా ఒకప్పటి విషయం. రామ్ గోపాల్ వర్మ సినిమాల స్థాయిలో పడిపోతూ వచ్చింది. ఆయన ఒక దశకు వచ్చాక క్రియేటివిటీ కంటే కూడా కాంట్రవర్సీని నమ్ముకోవడం స్టార్ట్ చేశాడు. వ్యక్తులను, వ్యవస్థలు టార్గెట్ గా సినిమాలు చేస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ పొలిటికల్ గా కూడా యాక్టీవ్. కొందరు రాజకీయ నాయకులను ఇష్టపడతాడు. కొందరిని విభేదిస్తాడు. కొందరికి సలహాలు ఇస్తాడు. వర్మ టీడీపీ, జనసేనలకు వ్యతిరేకంగా సినిమాలు తీశారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పవర్ స్టార్ టైటిల్ తో మూవీ చేసి పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా విమర్శించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా తెరకెక్కిన సినిమా అనుకోవచ్చు.
అదే సమయంలో వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని వర్మ అభిమానిస్తారు. ఆయన జీవితం ఆధారంగా వ్యూహం, శబధం అనే చిత్రాలు చేశారు. ఇదిలా ఉండగా... తాజా వర్మ ఒక ట్వీట్ చేశాడు. '' ఎక్కువగా ఊహించుకున్నాం. ఇంత ప్రాధాన్యత ఇస్తే... గాడిద కూడా తాను సింహం అనుకుంటుంది'' అని కామెంట్ చేశాడు. ఇది ఎవరిని ఉద్దేశించి చేశాడనే చర్చ మొదలైంది.
మెజారిటీ నెటిజెన్స్ దీన్ని పొలిటికల్ సెటైర్ గానే చూస్తున్నారు. కామెంట్స్ బాక్స్ లో రామ్ గోపాల్ వర్మ ఫలానా వ్యక్తిని ఉద్దేశించి ఈ కామెంట్ చేశాడని అభిప్రాయ పడుతున్నారు. వర్మ చక్కగా ఓ వార్ స్టార్ట్ చేసి.. హ్యాపీగా కామెంట్స్ చదువుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరైతే... ఈ కామెంట్స్ నీకే సూట్ అవుతుందని రివర్స్ సెటైర్ వేస్తున్నారు.