Prabhas Mirai Remuneration: మిరాయ్ మూవీ హిట్ కావడంలో హీరో ప్రభాస్ హాట్ టాపిక్ మారారు. డార్లింగ్ ప్రభాస్ నేరుగా నటించకపోయినా, ఆయన వాయిస్, ఏఐ లుక్ కారణంగా స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. మిరాయ్ కోసం ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?
యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "మిరాయ్". సూపర్ మెన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఎన్నో హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకవెళ్తుంది. మొదటి రోజే ₹27.20 కోట్లు వసూలు చేసి, సక్సెస్ పుల్ గా దూసుకెళ్తుంది.
27
మిరాయ్ మ్యాజిక్
సూపర్ మెన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘మిరాయ్’లో సీనియర్ హీరోయిన్ శ్రీయ సరన్ తొలిసారి తల్లి పాత్రలో నటించగా, రితీక నాయక్ హీరోయిన్‌గా నటించారు. ఇక మంచు మనోజ్ ప్రతినాయక పాత్రలో దుమ్మురేపాడు. సీనియర్ నటులు జగపతి బాబు, జయరాం, దర్శకులు తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మిరాయ్ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలైంది.
37
హాట్ టాఫిక్ గా ప్రభాస్
ఇదిలా ఉంటే.. మిరాయ్ సినిమా గురించి ఎక్కువగా చర్చకు వచ్చిన విషయం మాత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈ చిత్రంలో ఆయన నేరుగా నటించకపోయినా, స్టార్టింగ్ వాయిస్ ఓవర్‌తో పాటు రాముడి గెటప్‌లోని ఆయన ఫోటోను AI టెక్నాలజీ ద్వారా ఉపయోగించారు. దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత అన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌కి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ప్రస్తుతం అదే బ్యానర్‌లో ఆయన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ది రాజా సాబ్" సినిమాలో నటిస్తున్నారు. అందువల్ల మిరాయ్ టీంకి రెమ్యూనరేషన్ లేకుండా సహకరించారని అంటున్నారు.
57
ఇంతకు ముందు కూడా ఇదే!
ఇది ప్రభాస్ గెస్ట్ రోల్ నటించడం మొదటి సారి కాదు. గతంలో మంచు విష్ణు నటించిన "కన్నప్ప" మూవీలో కూడా ఆయన కీలక పాత్రలో నటించారు. ఈ పాత్ర కూడా ప్రభాస్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ప్రభాస్ కు మోహన్ బాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా కన్నప్ప సినిమాకు ఫ్రీగా నటించారని టాక్.
67
నెటిజన్ల ప్రశంసలు
ఇక, ఈ వార్త వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు ప్రభాస్‌కి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ఇతర స్టార్‌లు తమ ఫోటో, వాయిస్ వాడుకున్నా కోట్ల రూపాయలు అడుగుతారు, కానీ ప్రభాస్ మాత్రం ఫ్రెండ్ ఫిప్ కోసం ఎలాంటి డబ్బులు తీసుకోలేదు" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
77
ప్రభాస్ అప్ కమ్మింగ్ మూవీ
ప్రస్తుతం ప్రభాస్ మారుతితో "ది రాజా సాబ్", హను రాఘవపూడి ‘ఫౌజీ’సినిమాలతో బిజీబిజీ గా ఉన్నారు. ఆ తరువాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’మూవీ తెరకెక్కబోతుంది. అలాగే నాగ్ అశ్విన్ తో "కల్కి 2", ప్రశాంత్ నీల్ తో "సలార్ 2" ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. మరోవైపు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమా చేయనున్నాడు.