యష్మి కోసం కొట్టుకున్న నిఖిల్‌, గౌతమ్‌.. లవర్స్ మధ్య బిగ్‌ బాస్‌ పెట్టింది మామూలు ఫిట్టింగ్‌ కాదు

First Published | Oct 29, 2024, 11:46 PM IST

బిగ్‌ బాస్‌ షోలో యష్మి, నిఖిల్‌, గౌతమ్‌ల మధ్య ట్రయాంగిల్‌ లవ్‌ ట్రాక్‌ నడిచిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఎపిసోడ్‌లో యష్మి కోసం నిఖిల్‌, గౌతమ్‌ కొట్టుకునేంత వరకు వెళ్లడం విశేషం. 

photo-star maa big boss telugu 8 promo

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఈ వారం నామినేషన్‌లో గౌతమ్‌, నయని పావని, హరితేజ, యష్మి, తేజ ఉన్నారు. ఇక తొమ్మిదో వారం టాస్క్ లతో హీటెక్కించాడు బిగ్‌ బాస్‌. ఇన్నాళ్లు రెండు క్లాన్‌లుగా ఉన్న బిగ్‌ బాస్‌ హౌజ్‌ని ఒక్కటి చేశాడు. రాయల్‌ క్లాన్‌, ఓజీ క్లాన్‌లను కలిపి బిగ్‌ బాస్‌ మెగా క్లాన్‌ గా మార్చేశాడు. ఈ క్లాన్‌ కోసం మెగా చీఫ్‌ అయ్యేందుకు టాస్క్ లతో రచ్చ చేశాడు బిగ్‌ బాస్‌. ఈ మేరకు హౌజ్‌మేట్స్ ని నాలుగు టీమ్‌లుగా విడగొట్టాడు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

photo-star maa big boss telugu 8 promo

యష్మి, గౌతమ్‌, ప్రేరణలు రెడ్‌ టీమ్‌గా, హరితేజ, నిఖిల్‌, అవినాష్‌ బ్లూ టీమ్‌గా, రోహిణి, పృథ్వీరాజ్‌, నయని పావని ఎల్లో టీమ్‌గా, తేజ, విష్ణుప్రియా నబీల్‌ గ్రీన్‌ టీమ్‌గా విభజించారు. రెడ్‌ టీమ్‌కి యష్మి, బ్లూ టీమ్‌కి హరితేజ, పృథ్వీ ఎల్లో టీమ్‌కి, నబీల్‌ గ్రీన్‌ టీమ్‌కి లీడర్లుగా ఉన్నారు.  వీరంతా మెగా చీఫ్‌ కోసం `బిగ్‌ బాస్‌ ఇంటికి దారేదీ` పేరుతో టాస్క్ లు పెట్టారు. అందులో భాగంగా మంచి మనిషి అనే టాస్క్ ఇచ్చాడు.

స్నోతో నాలుగు బొమ్మలున్నాయి. అందులో నాలుగు టీమ్‌లు ఆ స్నోకి పార్ట్ లు పెట్టి, మంచి మనిషిగా తయారు చేయాల్సి ఉంటుంది. అయితే టీమ్‌లోని ముగ్గురు ఒక ప్యాడ్‌పై నిల్చొని ఒకేసారి నడుస్తూ దాన్ని చేయాల్సి ఉంటుంది. ఇందులో బ్లూ టీమ్‌ విజయం సాధించింది. రెడ్‌ టీమ్‌కి ఎల్లో కార్దు ఇచ్చారు. 
 


photo-star maa big boss telugu 8 promo

అనంతరం పానిపట్టు యుద్ధం అనే మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో నాలుగు టీమ్‌లకు నాలుగు వాటర్‌ ట్యాంకులు ఇచ్చారు. వాటర్‌ని కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతి టీమ్‌ నుంచి ఒకరు టాస్క్ ఆడుతూ, బిగ్‌ బాస్‌ ఇచ్చిన లైన్‌ని ముందు దాటిన వాళ్లు ఇతర ట్యాంకుల నుంచి రంధ్రాలు ఓపెన్‌ చేసి వాటర్‌ని పోయేలా చేయాల్సి ఉంటుంది. అంతిమంగా ఎవరి ట్యాంక్‌లో తక్కువ వాటర్‌ ఉంటాయో వాళ్లు ఓడిపోయినట్టు పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
 

photo-star maa big boss telugu 8 promo

ఈ టాస్క్ లో నిఖిల్‌.. రెడ్‌ టీమ్‌ని టార్గెట్‌ చేశాడు. సంచాలక్‌ చెప్పిన వినకుండా వాళ్లని బాగా డిస్టర్బ్ చేశాడు. ఈ క్రమంలో నిఖిల్‌పై యష్మి ఫైర్‌ అయ్యింది. సంచాలక్‌ నిర్ణయాన్ని పాటించడం లేదని ఆమె మండిపడింది. అంతేకాదు ట్యాంక్‌ వద్ద వాళ్లు లేకుండా తోసేశాడు. పక్కకు లాగేశాడు. ఈ క్రమంలో గౌతమ్‌ రియాక్ట్ అయ్యాడు. డిస్టర్బ్ చేసిన విధానం బాగా లేదని, కరెక్ట్ కాదని ఫైర్‌ అయ్యారు.

ఈ క్రమంలో నిఖిల్‌, గౌతమ్‌ మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. సెన్స్ లేదా అని గౌతమ్‌ అనగా, ఆ తర్వాత అది కాస్త ఓవర్‌ యాక్షన్‌ నుంచి అరేయ్‌, బే అనే స్థాయికి వెళ్లింది. అంతేకాదు కొట్టుకునే దాకా వెళ్లింది. మధ్యలో అవినాష్‌, తేజ వంటి వారు కల్పించుకుని వారిని విడగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఇద్దరు తీవ్ర స్థాయిలో గొడవకు వెళ్లడం ఆశ్చర్యపరుస్తుంది. ఇద్దరు లవర్స్ మధ్య ఓ రకంగా యష్మిచిచ్చు పెట్టిందని చెప్పొచ్చు. యష్మి కోసం గౌతమ్‌, నిఖిల్‌ గొడవ పడటం విశేషం. 

photo-star maa big boss telugu 8 promo

యష్మిని గౌతమ్‌ ఇష్టపడిన విషయం తెలిసిందే. ఆమెతో క్లోజ్‌గా మూవ్ అయ్యాడు. అయితే ఆమె దూరం జరుగుతూ వచ్చింది. మధ్యలో కొంత క్లోజ్‌గానే ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్‌ కావడం లేదు. అయితే గౌతమ్‌ తనతో క్లోజ్‌గా మూవ్‌ అయిన తీరుని యష్మి తీసుకోలేకపోయింది. ఇబ్బంది పడుతూ వచ్చింది. ఇక తట్టుకోలేక రెండు రోజుల క్రితమే చెప్పింది.

దీంతో అప్పట్నుంచి గౌతమ్‌ దూరమయ్యాడు. తాము ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పినా, గౌతమ్‌లో మాత్రం ఆ బాధ ఉండిపోయింది. నామినేషన్స్ లో ఈ ఇద్దరు రెచ్చిపోయి కామెంట్లు చేసుకున్నారు. ఆమెపై కోపంతో అక్కా అక్కా అంటూ పిలవడం విశేషం. ఇక యష్మి.. నిఖిల్‌కి దగ్గరయ్యింది. సోనియా వెళ్లిపోవడంతో నిఖిల్‌ ఫ్రీ అయ్యాడు. దీంతో ఆయన్ని పట్టుకుంది యష్మి. ఈ క్రమంలో గౌతమ్‌ని దూరం పెట్టిన విషయం తెలిసిందే. దీంతో అటు యష్మిపై, ఇటు నిఖిల్‌పై ఫైరింగ్‌తో ఉన్నాడు గౌతమ్‌. ఈ రోజు టాస్క్ లో ఆ ఫైర్‌ అంతా కనిపించింది.  

read more: సావిత్రి చివరి రోజుల్లో ఎందులో నివసించిందో తెలుసా? అంతకంటే దారుణ స్థితి మరోటి లేదు!

also read: `జై హనుమాన్‌`గా స్టార్‌ డైరెక్టర్‌, ఇద్దరు హీరోల మధ్యనే అసలు ఫైట్‌?.. గూస్‌బంమ్స్ అప్‌డేట్‌
 

Latest Videos

click me!