ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో `స్పిరిట్` మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల చేసిన సౌండ్ టీజర్ ఆకట్టుకుంది. కానీ ఈ మూవీకి ముందే డార్లింగ్, వంగా మధ్య చాలా పెద్ద కథ నడిచింది.
ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో మూడు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. కమిట్ అయిన ప్రాజెక్ట్ లు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సందీప్ రెడ్డి వంగా మూవీ `స్పిరిట్` సౌండ్ స్టోరీని విడుదల చేశారు. ఇందులో ప్రభాస్‌ని ప్రకాష్ రాజ్ అరెస్ట్ చేసినట్టుగా వారి మధ్య కన్వర్జేషన్ బట్టి అర్థమవుతుంది. ప్రభాస్ ఐపీఎస్ అని చెబుతారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా చెబుతారు. ఈ సందర్భంగా చిన్నప్పట్నుంచి నాకు ఒక చెడ్డ అలవాటు ఉందని ప్రభాస్ చెప్పడం ఆకట్టుకుంది. సినిమాపై ఇది గూస్ బంమ్స్ తెప్పించింది. కేవలం చిన్న సౌండ్ టీజర్‌తోనే సినిమాపై హైప్ పెంచారు సందీప్.
25
సందీప్ రెడ్డిని రిజెక్ట్ చేసిన ప్రభాస్
అయితే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో సినిమా రావడానికి వెనుక చాలా కథ జరిగింది. దీనికి చాలా పెద్ద స్టోరీనే ఉంది. సందీప్‌ని ప్రభాస్ రిజెక్ట్ చేయడం, ప్రభాస్‌ని సందీప్ రిజెక్ట్ చేశాడట. ఒకరినొకరు తిరస్కరించిన తర్వాత `స్పిరిట్` వచ్చిందని సమాచారం. మరి ఇంతకి ఏం జరిగిందంటే. ప్రారంభంలో సందీప్ రెడ్డి వంగా ఓ కథని ప్రభాస్‌కి నెరేట్ చేశారు. కానీ అది డార్లింగ్‌కి నచ్చలేదట. దీంతో సందీప్‌కి నో చెప్పారు ప్రభాస్.
35
డార్లింగ్ కోరికని రిజెక్ట్ చేసిన సందీప్
అనంతరం సందీప్‌కి ఒక మూవీని సూచించాడట ప్రభాస్. ఓ హాలీవుడ్ మూవీని రీమేక్ చేయమని అడిగారట. కానీ రీమేక్ చేయడం ఇష్టం లేక డార్లింగ్ కోరికని రిజెక్ట్ చేశారట సందీప్. అది, ఇది కాదని చెప్పి ఓ కొత్త కథని రెడీ చేశాడు సందీప్ రెడ్డి వంగా. అదే `స్పిరిట్` స్టోరీ. ఈ కథ నచ్చడంతో ప్రభాస్ ఓకే చెప్పారు. అదిప్పుడు పట్టాలెక్కబోతుంది. అయితే ఇటీవల కేవలం సినిమా కాన్సెప్ట్ ని తెలియజేసేలా ఆడియో టీజర్ ని మాత్రమే విడుదల చేశారు. కానీ సినిమా షూటింగ్‌కి సంబంధించిన అప్ డేట్ ఇవ్వలేదు.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నేపథ్యంలో `స్పిరిట్`
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా మూవీ అంతర్జాతీయ మాదకద్రవ్యాల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని, ఇందులో డార్లింగ్ పవర్‌ఫుల్ ఐపీఎస్‌గా కనిపిస్తారని సమాచారం. మరి అలాంటి వ్యక్తి జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. అందుకు దారితీసిన పరిస్థితులేంటనేది ఆసక్తికరం. ఇందులో `యానిమల్` ఫేమ్ తృప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుంది. వివేక్ ఓబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సీనియర్ నటి కాంచన మరో ముఖ్య పాత్ర పోషిస్తుంది. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ పతాకాలపై ప్రణవ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కానుందని 2027లో విడుదల చేయబోతున్నారని సమాచారం. తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
55
ది రాజా సాబ్, ఫౌజీలతో ప్రభాస్ బిజీ
ప్రస్తుతం ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో `ది రాజాసాబ్` మూవీలో నటిస్తున్నారు. ఫాంటసీ హర్రర్ కామెడీగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేశాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` మూవీలో నటిస్తున్నారు. వార్ నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని కూడా 2027లో విడుదల చేసే అవకాశం ఉంది.