ఎన్టీఆర్ కి సంబంధించి వీక్‌నెస్‌లను రాజమౌళి చాలా సార్లు బయటపెట్టారు. ఓపెన్ గానే కామెంట్ చేశారు. అందులో భాగంగా తారక్‌కి ఆయన భార్య లక్ష్మీ ప్రణతి ఇచ్చిన వార్నింగ్‌ని కూడా వెల్లడించారు రాజమౌళి.
ఎన్టీఆర్ విషయంలో రాజమౌళికి ప్రారంభం నుంచి కంప్లెయింట్స్ ఉంటూనే ఉన్నాయి. ఆయన తొలి సినిమా సమయంలోనే షాకింగ్ కామెంట్లు చేశారు. ఈయనేంట్రా ఇలా ఉన్నాడని మనసులో అనుకున్నాడట. అప్పట్లో తారక్ లావుగా ఉన్నారు. దీంతో `స్టూడెంట్ నెం 1` మూవీ చేసే సమయంలో రాజమౌళిలో అలాంటి ఫీలింగ్ కలిగింది. కానీ తారక్‌లోని టాలెంట్‌ని చూసి ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాజమౌళి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. జక్కన్న ఎక్కువగా తారక్‌తోనే సినిమాలు చేసిన విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి.
25
ఎన్టీఆర్ డ్రెస్ స్టయిల్‌పై రాజమౌళి కామెంట్
అయితే ఎన్టీఆర్‌కి సంబంధించిన ఒక వీక్‌నెస్‌ని, మరో రహస్యాన్ని వెల్లడించారు రాజమౌళి. ముఖ్యంగా ఆయన డ్రెస్సింగ్ స్టయిల్ గురించి వెల్లడించారు. తారక్ డ్రెస్‌పై తన కంప్లెయింట్‌ని వెల్లడించారు. ఎన్టీఆర్ ప్రారంభంలో ఎప్పుడూ ఒక బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ ధరించేవారట. ఏ ఫంక్షన్‌కి వచ్చినా అదే డ్రెస్ ఉండేదట. బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ గానీ, లేదంటే జీన్స్ బ్లూ బ్లాక్ షర్ట్ గానీ వేసుకునేవాడట. ఎప్పుడూ అదే లుక్‌లో బోరింగ్‌గా అనిపించేదట. మార్చమని ఎన్ని సార్లు చెప్పినా వినలేదట. కానీ `రామయ్యా వస్తావయ్యా` ఈవెంట్‌కి మాత్రం కొత్తగా వచ్చాడని, ఫస్ట్ టైమ్ డ్రెస్సింగ్ స్టయిల్ మార్చాడని తెలిపారు రాజమౌళి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ `రామయ్యా వస్తావయ్యా` మూవీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆడియో ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చిన రాజమౌళి ఈ విషయాన్ని తెలిపారు.
35
లక్ష్మీ ప్రణతి వార్నింగ్‌తో ఎన్టీఆర్‌లో మార్పు
ఈ సందర్భంగా రాజమౌళి ఇంకా కొనసాగిస్తూ, నీట్‌గా టక్ వేసుకుని, అదిరిపోయే షూస్ ధరించి తారక్ చాలా స్టయిలీష్‌గా ఉన్నాడని తెలిపారు. కొత్త లుక్ బాగుందని, ఇదే కొనసాగించాలని తెలిపారు. అయితే ఇదంతా లక్ష్మీ ప్రణతి పని అని, ఆమె వచ్చాకనే ఎన్టీఆర్ లో మార్పు వచ్చిందన్నారు. ఆ క్రెడిట్ మొత్తం ప్రణతిదే అని, ఈ డ్రెస్ వేసుకోకపోతే ఆమె చాలా వార్నింగ్ లు ఇచ్చిందని తెలిపారు. ఇలా ఎన్టీఆర్ ఇంటి విషయాలను జక్కన్న రివీల్ చేయడం విశేషం. `రామయ్యా వస్తావయ్యా` ఆడియో వేడుకలో ఈ విషయాన్ని వెల్లడించారు రాజమౌళి. అప్పటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం.
రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో చివరగా `ఆర్‌ఆర్‌ఆర్` మూవీ వచ్చింది. రామ్ చరణ్ మరో హీరోగా నటించిన ఈ సినిమా నాలుగేళ్ల క్రితం విడుదలైంది. సుమారు రూ.1250కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబు హీరోగా ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ గ్లోబల్ ఫిల్మ్ ని రూపొందిస్తున్నారు జక్కన్న. ఇందులో మహేష్ ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తాడని సమాచారం. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చే నెలలో రానుంది. దీని కోసం ఓ భారీ ఈవెంట్‌ని కూడా ప్లాన్ చేస్తున్నారట.
55
డ్రాగన్ మూవీతో ఎన్టీఆర్ బిజీ
మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. దీనికి `డ్రాగన్` అనే టైటిల్ వినిపిస్తోంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయ్యింది. అయితే ఇప్పటి వరకు షూట్ చేసిన కంటెంట్ విషయంలో తారక్ సంతృప్తి చెందలేదట. దీంతో అదంతా స్క్రాప్ లోకి వెళ్లిందని, త్వరలో మళ్లీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం.