ప్రభాస్‌ విలన్‌గా మారేలా చేసిన రాజమౌళి, కత్తి కోసం గొడవ.. డార్లింగ్‌ చేసిన పనికి జక్కన్నకి ఫ్యూజులు ఔట్‌

Published : Nov 29, 2024, 05:15 PM IST

ప్రభాస్‌, రాజమౌళి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. కానీ ఇద్దరు సడెన్‌గా శత్రువులుగా మారిపోయారు. కత్తి విషయంలో గొడవ పెద్ద పెంట అయ్యింది.   

PREV
17
ప్రభాస్‌ విలన్‌గా మారేలా చేసిన రాజమౌళి, కత్తి కోసం గొడవ.. డార్లింగ్‌ చేసిన పనికి జక్కన్నకి ఫ్యూజులు ఔట్‌

ప్రభాస్‌ అందరికి ఇష్టమైన హీరో. సింపుల్‌గా చెప్పాలంటే ఆయన అందరికి డార్లింగ్‌. అటు హీరోలు, ఇటు దర్శకులు, మరోవైపు నిర్మాతలు, టెక్నీషియన్లు ఆయన్ని ఇష్టపడతారు. ఫ్యాన్స్ కి ఉన్న ఇష్టం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరు ఇష్టపడే ప్రభాస్‌ ని విలన్‌గా మార్చేశాడు రాజమౌళి. ఆయనకు కోపం తెప్పించాడు. పంతానికి పోయి పెద్ద రచ్చకి తెరలేపాడు జక్కన్న. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

27
photo credit-maa tv

ఈ గొడవ మొత్తం కత్తి కోసం కావడం విశేషం. `ఛత్రపతి`లో ఉపయోగించిన కత్తిని ఎవరి వద్ద ఉండాలనేది చర్చ. నా వద్ద ఉండాలని ప్రభాస్‌, నా వద్దే ఉండాలని రాజమౌళి పట్టుపట్టారు. పంతానికిపోయారు. నిర్మాతకి ఊపిరి మెసలనివ్వకుండా చేశారు. దీంతో వార్‌కే దిగారు. గ్రౌండ్‌లో ఇద్దరు పోటీ పడ్డారు. ఈ క్రమంలో ప్రభాస్‌ని విలన్‌గా మార్చేశాడు రాజమౌళి. దీంతో ఇద్దరి మధ్య పెద్ద వారే జరిగింది. 
 

37

ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో `ఛత్రపతి` సినిమా వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి సినిమా ఇదే. అప్పట్లో ఇది పెద్ద హిట్‌ అయ్యింది. ఆ సమయంలో ఇండస్ట్రీ హిట్‌ అని చెప్పొచ్చు. కలెక్షన్ల పరంగా దుమ్మురేపిన చిత్రమిది. ప్రభాస్‌కి జోడీగా శ్రియా హీరోయిన్‌గా నటించింది. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. భాను ప్రియా ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమా విడుదలైన మంచి ఆదరణ పొందింది. హిట్‌ అని చెప్పాల్సిందే. 
 

47
photo credit-maa tv

ఆ సమయంలో ప్రభాస్‌, రాజమౌళి మధ్య గొడవ. అది కూడా `ఛత్రపతి` సినిమాలో ప్రభాస్‌ వాడిన కత్తి గురించి గొడవ. నా వద్ద ఉండాలని ప్రభాస్‌, నా వద్దనే ఉండాలని రాజమౌళి పోటీ పడ్డారు. దర్శకుడే గొప్ప అని, హీరోనే గొప్ప అని పంతానికి పోయారు. అంతేకాదు ఛత్రపతి సినిమా నా వల్లే హిట్‌ అయ్యిందని ప్రభాస్‌, నా వల్లే హిట్‌ అయ్యింది రాజమౌళి వాదించుకున్నారు. దానికోసం పెద్ద కుట్రలు కూడా చేసుకున్నారు. ఫైనల్‌గా కత్తి ఎవరికి దక్కాలనే చర్చ వచ్చింది. క్రికెట్‌ మ్యాచ్‌ ఆడదామని నిర్ణయించుకున్నారు. 
 

57
photo credit-maa tv

టెక్నీషియన్లు అంతా ఒకటి, ఆర్టిస్టులంతా ఒక టీమ్‌ గా మారారు. ఈ క్రికెట్‌ ఆడేందుకు కూడా కారాలు మిర్యాలు నూరుకున్నారు. మొత్తానికి తొండో, మొండో చేసి క్రికెట్‌ ఆడారు. ఫైనల్‌గా రాజమౌళి టీమ్‌ గెలిచింది. ప్రభాస్‌ ఒక్కసారిగా డల్‌ అయ్యాడు. అంతేకాదు హీరో టీషర్ట్ స్థానంలో దర్శకుడు టీషర్ట్ వేసుకున్నాడు. ఆయనే గొప్ప అనే చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ తన గ్యాంగ్‌ని పంపించి ఆ కత్తిని కొట్టేయించాడు. అంతిమంగా ప్రభాస్‌ విలన్‌గా మారి కత్తిని దొంగిలించాడు. అలా గేమ్‌లో ఓడిపోయినా, కత్తి మాత్రం తనవద్దే ఉండాలని తెచ్చుకున్నాడు. అలా కథకి ముగింపు పలికింది. 
 

67

అయితే ఇదంతా ఫన్‌ కోసం చేసిన వీడియో కావడం విశేషం. `ఛత్రపతి` సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని మరింత పెంచేందుకు ఈ డ్రామా ప్లాన్‌ చేశారు డార్లింగ్‌, రాజమౌళి. ఆద్యంతం రక్తికట్టేలా ఈ డ్రామా క్రియేట్‌ చేశారు. సినిమాని తలపించిందని చెప్పొచ్చు. ఆద్యంతం నవ్వుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ రేర్‌ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. 

77

ప్రస్తుతం రాజమౌళి.. మహేష్‌ బాబుతో సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం కానుందట. మరోవైపు ప్రభాస్‌ ఇటీవలే `కల్కి 2898ఏడీ` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు `ది రాజా సాబ్‌`, హను రాఘవపూడి మూవీలో నటిస్తున్నారు. `స్పిరిట్‌`, `సలార్‌ 2`, `కల్కి 2` రూపొందాల్సి ఉంది. 

read more: బిజినెస్‌లో ఆరితేరిన విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌ క్రేజ్‌ని వాడకంలో ఇది నెక్ట్స్ లెవల్‌

also read: తాత ఏఎన్నార్‌ రొమాన్స్ ముందు నాగ్‌ మామ సరిపోడు.. చివరి రోజుల్లో ఆసుపత్రిలో నర్స్ తో కూడా
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories