ఇది కదా బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సింది? మాస్ లుక్ తో మైండ్ బ్లాక్ చేసిన మోక్షజ్ఞ!

First Published | Nov 29, 2024, 3:57 PM IST

మోక్షజ్ఞ రాటుదేలుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మాస్ హీరో అప్పీల్ కోసం జుట్టు గడ్డం పెంచాడు. నందమూరి వారసుడి లేటెస్ట్ లుక్ కాక రేపుతోంది. 
 

Mokshagna Nandamuri

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హీరో కావాలి అనేది, అభిమానుల చిరకాల కోరిక. చాలా ఏళ్లుగా వారు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు స్టార్ అయ్యాడు. నాగార్జున ఇద్దరు కుమారులు సైతం సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. 
 

మోక్షజ్ఞ మాత్రం ఇంకా అరంగేట్రమే చేయలేదు. గత పదేళ్లుగా మోక్షజ్ఞ హీరో కావాలనే డిమాండ్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఏపీలోని కొన్ని ఏరియాల్లో ప్రతి ఏటా మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు ఘనంగా చేస్తారు. కొన్నిసార్లు సదరు వేడుకలకు మోక్షజ్ఞ హాజరైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏళ్లకు ఏళ్ళు ఎదురు చూసి ఆశలు వదిలేశాక మోక్షజ్ఞకు మూడ్ వచ్చింది. ముప్పై ఏళ్ల వయసులో రంగంలోకి దిగుతున్నాడు. 


దర్శకుడు ప్రశాంత్ వర్మతో డెబ్యూ మూవీ చేస్తున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా అయ్యింది. త్వరలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక మోక్షజ్ఞ లుక్ ఒకటి విడుదల చేశారు. ఆ లుక్ సినిమాకు సంబంధించినదా కాదా అనే విషయంలో క్లారిటీ లేదు. మోక్షజ్ఞ లుక్ కి మిశ్రమ స్పందన దక్కింది. ప్రస్తుతం మోక్షజ్ఞ శిక్షణలో ఉన్నాడని సమాచారం. యాక్టింగ్, ఫైటింగ్, డాన్సులతో శిక్షణ తీసుకుంటున్నాడట. 

స్టార్ హీరో కొడుకుగా పుట్టినంత సులభం కాదు స్టార్ కావడం. టాలెంట్ లేకపోతే ఎంత రుద్దినా జనాలు కొన్నాళ్ళకు తిరస్కరిస్తారు. కాబట్టి హీరోగా సక్సెస్ కావడం మోక్షజ్ఞకు పెద్ద సవాల్. ఎందుకంటే ఆయన ఫెయిల్ అయితే.. అది బాలయ్యకు అవమానంతో కూడిన వ్యవహారం. మరోవైపు ఆయన తోటి నటుల వారసులు సిల్వర్ స్క్రీన్ ని దున్నేస్తున్న తరుణంలో స్టార్డం తెచ్చుకోవడం చాలా అవసరం. 
 

కాగా నేడు దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలయ్య ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ విడుదల చేశాడు. మొదటి పోస్టర్ లో స్మార్ట్ గా కనిపించిన మోక్షజ్ఞ... లేటెస్ట్ లుక్ కాకరేపుతుంది. గడ్డం పెంచి రఫ్ అండ్ మాస్ అప్పీల్ ఇచ్చాడు. నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి. ఇది కదా మాకు కావాల్సింది అని కామెంట్స్ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ సబ్జెక్టు తో మోక్షజ్ఞ మూవీని ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారట. ఇది కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమే అంటున్నారు. ఈ సిరీస్లో హనుమాన్ తెరకెక్కింది. జై హనుమాన్ ప్రకటించారు. 

Mokshagna Nandamuri

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య జానకిరామ్ కుమారుడు కూడా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఎన్టీఆర్-బాలయ్యల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న తరుణంలో నందమూరి వారసులను పోటాపోటీగా పరిశ్రమలోకి తీసుకొచ్చారనే వాదనలు కూడా ఉన్నాయి. మరి చూడాలి.. సిల్వర్ స్క్రీన్ పై నందమూరి వారసుల హవా ఈ మేరకు సాగుతుంది. జానకిరామ్ కొడుకు పేరు కూడా ఎన్టీఆర్ కావడం విశేషం.

Latest Videos

click me!