జోసెఫ్ ప్రభు మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. నిద్రలో ఆయన హార్ట్ అటాక్ కి గురయ్యారట, అదే ఆయన మరణానికి కారణం అని ప్రాథమిక సమాచారం. సమంత తండ్రి జోసెఫ్ భార్యతో పాటు చెన్నైలో ఉంటున్నారు. ఈ న్యూస్ చిత్ర వర్గాల్లో విషాదం నింపింది. ఈ ఘటన సమంతను తీవ్ర వేదనలో నింపింది. తాను కెరీర్లో ఎదగడం వెనుక తండ్రి జోసెఫ్ కృషి ఎంతగానో ఉందని సమంత పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.