ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన రాజాసాబ్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో రాజాసాబ్ సెన్సార్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ చిత్రం సంక్రాంతి కానుకగా ట్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ చేసేశారు. బాహుబలి నుంచి ప్రభాస్ ఎక్కువగా సీరియస్ సినిమాలే చేస్తున్నారు. దీనితో అభిమానులు ప్రభాస్ కామెడీ టైమింగ్ ని మిస్ అవుతూ వచ్చారు. ఈ చిత్రంతో అభిమానుల కోరిక తీరబోతోంది. రాజాసాబ్ చిత్రం హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతోంది.
25
హారర్ కామెడీ చిత్రంగా రాజాసాబ్
డైరెక్టర్ మారుతీ సినిమాల్లో కామెడీ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ప్రభాస్ క్రేజ్ కి తగ్గట్లుగా భారీతనం ఉంటూనే, హారర్ ఎలిమెంట్స్, కామెడీతో మెప్పించబోతున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల రాజాసాబ్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు తెలుస్తోంది. దీనితో ఈ చిత్రానికి సంబంధించిన రన్ టైం, సెన్సార్ టాక్ బయటకు వచ్చింది.
35
సెన్సార్ కంప్లీట్
అందుతున్న సమాచారం మేరకు రాజాసాబ్ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల పెద్ద సినిమాలకు దాదాపు 3 గంటల రన్ టైం ఉండడం సాధారణంగా మారిపోయింది. రాజాసాబ్ చిత్రానికి కూడా రన్ టైం 3 గంటలపైనే ఉంది. చిత్ర యూనిట్ 3 గంటల 3 నిమిషాల రన్ టైంని లాక్ చేశారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.
సెన్సార్ సభ్యుల నుంచి రాజాసాబ్ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఎక్కువ ఎంగేజింగ్ గా ఉండబోతోందట. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్, ట్విస్టులు ఆకట్టుకుంటాయి అని అంటున్నారు. మొత్తం మొత్తం 183 నిమిషాల రన్ టైం కాగా అందులో 103 నిమిషాలు సెకండ్ హాఫ్ లోనే ఉంటుందట. సో సెకండ్ హాఫ్ లో చాలా కథ చెప్పాల్సి ఉంటుంది. అందుకే రాజాసాబ్ చిత్రానికి సెకండ్ హాఫ్ కీలకం అని అంటున్నారు. సెకండ్ హాఫ్ వర్కౌట్ అయితే రాజాసాబ్ చిత్రమే సంక్రాంతి విన్నర్ అని అంటున్నారు.
55
రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. నేడు శనివారం డిసెంబర్ 27న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనితో రాజాసాబ్ సంక్రాంతి హంగామా ముందే మొదలైపోతుంది. జనవరి 9న ఈ చిత్రం రిలీజ్ కానుండగా 8 వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించే అవకాశం ఉంది.