ఆ విషయంలో అమితాబ్‌ బచ్చన్‌ని మించిపోయిన ప్రభాస్‌.. ఇండియన్‌ సినిమాకి `ఒకేఒక్కడు`.. అందుకు కారణం కూడా ఒక్కడే

Published : Oct 23, 2021, 09:01 AM ISTUpdated : Oct 23, 2021, 09:03 AM IST

ప్రభాస్‌.. అభిమానులకు `డార్లింగ్`.. బాక్సాఫీసుకి `బాహుబలి`. ఆయన బాక్సాఫీసు రంగంలోకి దిగితే అంతా `సాహో` అనాల్సిందే. పాన్‌ ఇండియా సినిమాకి కొత్త అర్థాన్నిచ్చిన ప్రభాస్‌.. ఇప్పుడు ఓ విషయంలో మాత్రం బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ని మించిపోయాడు.   

PREV
18
ఆ విషయంలో అమితాబ్‌ బచ్చన్‌ని మించిపోయిన ప్రభాస్‌.. ఇండియన్‌ సినిమాకి `ఒకేఒక్కడు`.. అందుకు కారణం కూడా ఒక్కడే

ప్రభాస్‌(Prabhas Birth Day) నేడు(అక్టోబర్‌ 23) తన 42వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. దీంతో ప్రభాస్‌కి సంబంధించిన విశేషాలు ఇప్పుడు అన్ని మీడియా మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు, అరుదైన సంఘటలు ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. మొత్తంగా ప్రభాస్‌ ఈ రోజుని ఏలబోతున్నాడు. వరల్డ్ వైడ్‌గా ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌ ఇప్పుడు బయపడుతుంది. అభిమానులు ఆయన్ని వరల్డ్ వైడ్‌గా ట్రెండ్‌ చేస్తుండటం విశేషం. 

28

ప్రభాస్‌ ఇప్పుడు ఇండియన్‌ సినిమాకి ఓ బ్రాండ్‌. ఇప్పటి వరకు మరే హీరోకి సాధ్యం కానంతటి ఇమేజ్‌ని, పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ పేరుతో వేల కోట్ల వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. అదొక ప్రభాస్‌ అనే పేరుకే సాధ్యమైంది. గతంలో మరే హీరోకి ఇలాంటి అరుదైన ఘనత సాధ్యం కాలేదు. ఇమేజ్‌ కూడాసాధ్యం కాలేదు. 

38

అయితే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ వంటి భాషల్లో సూపర్‌ స్టార్లుగా చాలా మంది వెలుగొందారు. మెగాస్టార్లుగా కీర్తి గడించారు. కానీ ఆయాభాషలకే పరిమితం. ఇతర భాషలను ప్రభావితం చేసింది చాలా అరుదు. కానీ ఒక్క అమితాబ్‌ బచ్చన్‌ ఆ విషయంలో సక్సెస్‌ అయ్యారు. ఇండియా వైడ్‌గా ఆయనకి అభిమానగణం ఏర్పడింది. 

48

కానీ ఆ విషయంలో అమితాబ్‌ని మించిపోయాడు ప్రభాస్‌. అవును ప్రభాస్‌ ఏకంగా ఇప్పుడు ఇండియాలోని అన్ని ప్రధాన భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన `బాహుబలి`, `సాహో` చిత్రాలు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషల్లో విడుదలయ్యాయి. వీటితోపాటు చైనా, జపాన్‌లోనూ రిలీజ్‌ అయి భారీ కలెక్షన్లని సాధించాయి. ప్రస్తుతం నటిస్తున్న `ఆదిపురుష్‌`, `సలార్‌`, `రాధేశ్యామ్‌`, `ప్రాజెక్ట్ కే` చిత్రాలు కూడా ప్రధానంగా అన్ని ఇండియన్‌ లాంగ్వేజ్‌ల్లోనూ విడుదల కాబోతున్నాయి. 
 

58

అమితాబ్‌ బచ్చన్‌(Amitabh) బాలీవుడ్‌కి మించిన క్రేజ్‌ ని, ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఆయన హిందీతోపాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేయడం, ఆయన తన సినిమాలతో ఇండియా వైడ్‌గా పాపులారిటీ సొంతం చేసుకోవడం వల్ల అందరికి బాగా కనెక్ట్ అయ్యారు. భాషా బేధం లేకుండా ఇతరభాషల వారు కూడా అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలను ఆదరించారు. కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్‌ హాసన్‌, బాలీవుడ్‌లో ధర్మేంద్ర, రాజ్‌కుమార్‌, దిలీప్‌ కుమార్‌ వంటి హీరోలు తిరుగులేని స్టార్ ఇమేజ్‌ పొందినా.. అది Amitabh Bachchan తర్వాతనే అనే ఫీలింగ్‌ ఉంటుంది. 
 

68

ఇది కాదని సందీప్‌ రెడ్డి వంగాతో చేయబోతున్న `స్పిరిట్‌` చిత్రం ఏకంగా ఇతర దేశాల్లోనూ రిలీజ్‌ కాబోతుండటం విశేషం. అంతేకాదు నాగ్‌ అశ్విన్‌తో చేయబోతున్న సినిమా `పాన్‌ వరల్డ్ మూవీ` అని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఇదంతా ఆయా దేశాల్లో ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వల్లే సాధ్యమైంది. ఇలా చూస్తుంటే ప్రభాస్‌ ఇప్పుడు ఇండియన్‌ సినిమాని దాటిపోయాడు. వరల్డ్ సినిమాలో భాగమైపోయాడు. గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిపోయాడు. పాన్‌ వరల్డ్ మూవీ అనే ట్రెండ్‌కి శ్రీకారం చుడుతున్నాడు ప్రభాస్‌.  దీంతో ఇప్పుడు డార్లింగ్ ఇండియన్ సినిమాకి ఒకే ఒక్కడుగా నిలిచిపోయాడు. 

78

అంతేకాదు ఇప్పుడు ఇతర హీరోలకు స్ఫూర్తినిస్తున్నాడు ప్రభాస్‌. మార్గదర్శకంగా నిలుస్తున్నారు. బాక్సాఫీసు విస్తరణకు బాటలు వేస్తున్నాడు. ప్రభాస్‌ పాన్ ఇండియాల కారణంగా మన తెలుగు చిత్ర పరిశ్రమ స్పాన్‌ పెరిగింది. ఆయనతోపాటు అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, పవన్‌, చిరు, విజయ్ దేవరకొండ ఇలా పాన్‌ ఇండియాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగులోనే అత్యధికంగా పాన్‌ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయంటే అతిశయోక్తి కాదు. తెలుగులోనే కాదు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రాలకు దారిచూపి, వాటికి ఊతమిచ్చాడు ప్రభాస్‌.

88

అయితే దీనింతటికి కారణం కూడా ఒకే ఒక్కడని చెప్పొచ్చు. ఆయనే దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli). ఆయన `బాహుబలి`(Bahubali) లాంటి సినిమాని చేయకపోతే ప్రభాస్‌ ఇప్పుడీ స్థాయిలో ఉండే వారు కాదు, పాన్‌ ఇండియా ట్రెండ్‌ వచ్చేది కాదు. Rajamouli `బాహుబలి` చేయడం వల్లే బాక్సాఫీసు బారియర్స్ బ్రేక్‌ అయ్యారు. ప్రాంతాలకు పరిమితమైన సినిమా ఇప్పుడు ఇండియా వైడ్‌గా వ్యాపించింది. అన్ని భాషలు ఏకమయ్యాయి. కాబట్టి ఆ క్రెడిట్‌ మాత్రం రాజమౌళికి ఇవ్వాల్సిందే. 

related news: HBD Prabhas: ప్రభాస్ జాతకం తిరగేస్తున్న జ్యోతిష్యులు.. ఎంజీఆర్, రజనీకాంత్ లాగే.. పెళ్లిపై అంచనా

also read: స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతున్న ప్రభాస్‌.. `రాధేశ్యామ్‌` టీజర్‌కి ముందు స్వీట్‌ సర్‌ప్రైజ్‌లు
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories