కోడి గుడ్ల టాస్క్ లో జరిగిన గొడవతో సన్నీ, ప్రియా శత్రువులుగా మారిన సంగతి తెలిసిందే. ఇతర హౌస్ మేట్స్ తో ప్రియా.. సన్నీ గురించి ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఈసారి సన్నీ కనిపిస్తే కన్నుకొట్టి.. ఫ్లైయింగ్ కిస్ ఇస్తా అంటూ కామెంట్స్ చేస్తుంది. ఇంతలో బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ప్రకటిస్తారు. రవి, మానస్, కాజల్, విశ్వ , సన్నీ కెప్టెన్సీ టాస్క్ లో పోటీ దారులుగా ఉంటారు. టాస్క్ ప్రకారం పోటీ దారులంతా బిగ్ బాస్ ఇచ్చిన బెలూన్స్ నడుముకి కట్టుకోవాలి. బజార్ మోగిన ప్రతిసారి గార్డెన్ ఏరియాలో ఓ గుండు సూది ఉంచుతారు. ఆ సూదిని దక్కించుకున్నవారు తమకు ఇష్టమైన కెప్టెన్సీ పోటీ దారునికి ఇవ్వవచ్చు.