`ఈశ్వర్‌` సినిమాని మొదట ఏ హీరోతో చేయాలనుకున్నారో తెలుసా? ప్రభాస్‌ ని కూడా కాదని మరో హీరోకి

First Published | Oct 21, 2024, 6:58 PM IST

`ఈశ్వర్‌` సినిమాలో మొదట అనుకున్నది ప్రభాస్‌ని కాదా? అసలు హీరో వేరే ఉన్నాడా? డార్లింగ్‌ ఎలా వచ్చాడు? తెరవెనుక ఏం జరిగింది?
 

ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌ గా రాణిస్తున్న హీరో ప్రభాస్‌. ఇప్పుడు ఇండియన్‌ బిగ్గెస్ట్ యాక్టర్‌గా రాణిస్తున్న ప్రభాస్‌ 22ఏళ్ల క్రితం తన జర్నీని ప్రారంభించారు. ఆయన `ఈశ్వర్‌` సినిమాతో హీరోగా మారిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్‌ అనుకోకుండా హీరో అయ్యారు. ఆయన ముందుకు చేయాల్సిన సినిమా ఇది కాదు. `ఈశ్వర్‌`కి వేరే హీరోతో అనుకున్నారట. మరి ఆ సమయంలో జరిగిన తెరవెనుక కథేంటో చూద్దాం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ప్రముఖ దర్శకుడు జయంత్‌ సి పరాంజి అప్పట్లో అప్పటికే `ప్రేమించుకుందాం రా`, `బావగారు బాగున్నారా`, `ప్రేమంటే ఇదేరా`, `రావోయి చందమామ`, `టక్కరి దొంగ` వంటి హిట్‌ సినిమాలతో స్టార్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. ఆయన నటుడు, నిర్మాత అశోక్‌ కుమార్‌ నిర్మాతగా ఓ సినిమా చేయాలని భావించారు. ఓ ప్రముఖ హీరోగా కథ నెరేట్‌ చేశాడు. ఆయన దాటవేస్తూ వచ్చాడట. ఇలా లాభం లేదని కొత్తవాళ్లతో సినిమా చేయాలనుకున్నారట. ఆడిషన్‌ ప్రకటన ఇస్తే రెండు వేల మంది నుంచి ఫోటోలు, ప్రోఫైల్స్ వచ్చాయి. ఇంతలో నిర్మాత కొళ్ల అశోక్‌ కుమార్‌తోనూ చేయాలనుకున్నారు. ఆయన స్టడీస్‌ చేస్తున్నాడు, డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకున్నారు. 
 


అనంతరం నిర్మాత కేసీ శేఖర్‌ బాబు కలిసి తన మాటల్లో ఎవరినో చూస్తున్నారు, మన కృష్ణంరాజుగారి అబ్బాయి ఉన్నాడు కదా. ప్రభాస్‌ రాజు వైజాగ్‌లో సత్యానంద్‌ వద్ద ట్రైనింగ్‌ అవుతున్నాడు. ఆయన్ని పెట్టి ఎందుకు సినిమా చేయకూడదు అన్నాడట. సడెన్‌గా దర్శకుడు జయంత్‌కి, నిర్మాత అశోక్‌కుమార్‌కి పెద్ద బూస్ట్ లాగా అనిపించింది. వెంటనే వెళ్లి కృష్ణంరాజుని కలిశారు. కృష్ణంరాజు ఆయన మొదట అంతగా సుముఖత చూపించాలేదు. తానే తన గోపీకృష్ణ బ్యానర్‌లో పరిచయం చేయాలనుకున్నాం అన్నారు. ఆ తర్వాత సరే మీరు ఇంతగా అడుగుతున్నారు కదా అని ఓకే చెప్పాడట. 

అలా ప్రభాస్‌ `ఈశ్వర్‌` ప్రాజెక్ట్ లోకి వచ్చాడు. ప్రభాస్‌తో అనుకున్నాక కూడా మరో హీరోని కలిశారట. ఆయన నో చెప్పాడు. దీంతో చేసేదేం లేక ప్రభాస్‌తోనే ఈ మూవీ చేశారు. అయితే ప్రభాస్‌ని మొదటిసారి చూడగానే షాక్‌ అయ్యారట. ఆయన కటౌట్‌, హైట్‌, ఫిజిక్‌ చూసి ఆశ్చర్యపోయారట. మనకు కావాల్సిన కటౌట్‌ దొరికిందనుకున్నారట. మొదటి సినిమా కావడంతో ప్రభాస్‌ కూడా పెదనాన్న కృష్ణంరాజు చెప్పిన మాటతో మరో ఆలోచన లేకుండా `ఈశ్వర్‌` సినిమా చేశారు. ఈ విషయాన్ని నిర్మాత కోళ్ల అశోక్ కుమార్‌ తెలిపారు. మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం 2002 నవంబర్‌ 11న విడుదలైంది. సోమవారం ఈ సినిమాని రిలీజ్‌ చేయడం విశేషం. సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. అనుకున్నంత పెద్ద హిట్‌ కాలేదు. కానీ ప్రభాస్‌ మాస్‌ కటౌట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమాగా నిలిచింది. 
 

ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా శ్రీదేవి విజయ్‌ కుమార్‌ నటించింది. ఆమెకిది తొలి సినిమానే కావడం విశేషం. ఇలాఈ ఇద్దరు పరిచయం అయ్యారు. ఇందులో ప్రభాస్‌ నటన, యాక్షన్‌, డాన్సులకు మంచి పేరొచ్చింది. మాస్‌ ఆడియెన్స్ బాగా ఎంజాయ్‌ చేశారు. ముఖ్యంగా రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్ సినిమాని ఓన్‌ చేసుకున్నారు. ప్రభాస్‌కి జేజేలు పలికారు. ఈ మూవీ విడుదలై 22ఏళ్లు అవుతుంది. ఎల్లుండి ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా దీన్ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. మరి ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. 

ప్రభాస్‌ ప్రస్తుతం మూడు, నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన `ది రాజా సాబ్‌` సినిమాలో నటిస్తున్నారు. డార్లింగ్‌ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్‌ రాబోతుంది. దీంతోపాటు హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే `స్పిరిట్‌`, `సలార్‌ 2`, `కల్కి 2` సినిమాలు చేయాల్సి ఉంది. ఈ నెల 23న ప్రభాస్‌ తన  45వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. 

read more: మణికంఠ మరో పల్లవి ప్రశాంత్‌ అయ్యేవాడా? టైటిల్‌ విన్నర్‌ అతనేనా? వామ్మో ఇదేం క్రేజ్‌

Latest Videos

click me!