ఇన్నోసెంట్ గా కనిపించే శేఖర్ కమ్ముల ఆ హీరోయిన్ ప్రేమలో పడ్డారా ? అసలు నిజం ఇదే..

First Published | Oct 21, 2024, 6:25 PM IST

సున్నితమైన భావోద్వేగాలతో కథని చాలా అందంగా చెప్పే దర్శకుడు. శేఖర్ కమ్ముల చిత్రాల్లో హంగామా ఎక్కువ ఉండదు. ఒక ప్రవాహంలా కథ ఆహ్లాదభరితంగా సాగుతూ వెళుతుంది. ఆయన చిత్రాల్లాగే శేఖర్ కమ్ముల కూడా చాలా ఇన్నోసెంట్ గా, హుందాగా కనిపిస్తారు.

సున్నితమైన భావోద్వేగాలతో కథని చాలా అందంగా చెప్పే దర్శకుడు. శేఖర్ కమ్ముల చిత్రాల్లో హంగామా ఎక్కువ ఉండదు. ఒక ప్రవాహంలా కథ ఆహ్లాదభరితంగా సాగుతూ వెళుతుంది. ఆయన చిత్రాల్లాగే శేఖర్ కమ్ముల కూడా చాలా ఇన్నోసెంట్ గా, హుందాగా కనిపిస్తారు. ఇతర వివాదాల జోలికి వెళ్లడం శేఖర్ కమ్ములకి తెలియదు. 

అలాంటి శేఖర్ కమ్ములని కూడా రూమర్స్ విడిచిపెట్టలేదు. శేఖర్ కమ్ముల గురించి చాలా సంచలన రూమర్స్ వచ్చాయి. శేఖర్ కమ్ములకి తొలి సక్సెస్ లభించింది ఆనంద్ చిత్రంతో. ఆ చిత్రంలో కమలినీ ముఖర్జీ హీరోయిన్ గా నటించారు. ఆనంద్ చిత్రం తర్వాత గోదావరి, హ్యాపీ డేస్ చిత్రాల్లో కూడా ఆమెనే శేఖర్ కమ్ముల రిపీట్ చేశారు. 


దీనితో శేఖర్ కమ్ముల, కమలినీ ముఖర్జీ గురించి మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. శేఖర్ కమ్ముల, కమలినీ మధ్య సంథింగ్ సంథింగ్ సాగుతోందని.. శేఖర్ కమ్ముల ఆమెతో డీప్ గా ప్రేమలో ఉన్నారని పుకార్లు వినిపించాయి. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ నేరుగా శేఖర్ కమ్మలని ఈ ప్రశ్న అడిగారు. ఆనంద్ చిత్ర షూటింగ్ సమయంలో కమలినీ ముఖర్జీతో ప్రేమలో పడ్డారా అని ప్రశ్నించారు. 

కమలినీ ముఖర్జీకి అవకాశం ఇచ్చి ఆమెకి మీరే రియల్ లైఫ్ హీరో అయ్యారు అనే ప్రచారం జరుగుతోంది అంటూ యాంకర్ ప్రశ్నించారు. దీనికి శేఖర్ కమ్ముల నవ్వుతో ఆ రూమర్ లో ఎలాంటి వాస్తవం లేదు. అవి పూర్తిగా బేస్ లెస్ రూమర్స్. నేను కేవలం కమలినీ ముఖర్జీని మాత్రమే కాదు.. మిక్కీ జె మేయర్ ని రిపీట్ చేశాను. మరికొందరు నటుల్ని రిపీట్ చేశాను.. టెక్నిషియన్లని కూడా రిపీట్ చేశాను. కానీ మీడియా కి కనిపించింది మాత్రం కమలినీ ముఖర్జీ. 

నాతో వర్క్ చేసిన హీరోయిన్ కాబట్టి కంఫర్ట్ కోసం, అదే విధంగా రెమ్యునరేషన్, కథ అన్ని లెక్కలు వేసుకునే ఆమెని హీరోయిన్ గా తీసుకున్నాం. రూమర్స్ వస్తున్నట్లు మాత్రం కాదు. అందులో నిజం లేదు అని శేఖర్ కమ్ముల ఖండించారు. 

Latest Videos

click me!