చిరంజీవి త్యాగంతో హీరో అయిన కమెడిన్, ఏకంగా 365 రోజుల బ్లాక్ బస్టర్ మూవీతో సంచలనం, ఎవరా నటుడు?

First Published | Oct 21, 2024, 6:04 PM IST

చిరంజీవి ఓ త్యాగం చేయడం మిత్రుడికి సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. 
 

నటుడు కావాలనే మక్కువతో డిగ్రీ పూర్తయ్యాక చిరంజీవి మద్రాస్ వచ్చారు. అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరారు. నటనలో శిక్షణ తీసుకున్నారు. కోర్సు పూర్తి కాకముందే చిరంజీవికి ఓ చిత్రంలో ఆఫర్ వచ్చింది. చిరంజీవి సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు. కానీ ఆయన కెమెరా ముందుకు వెళ్లిన చిత్రం పునాదిరాళ్లు. ఈ చిత్రంలో ఆఫర్ ఎలా వచ్చిందో చిరంజీవి ఓ సందర్భంలో తెలియజేశాడు. 
 

Sudhakar

నాటకీయ పరిణామాల మధ్య పునాదిరాళ్ళు మూవీలో చిరంజీవి నటించాల్సి వచ్చింది. అదేమిటంటే.. చిరంజీవికి నటులు సుధాకర్, హరి ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో క్లాస్ మేట్స్. ఒకే రూమ్ లో ఉండేవారు. చిరంజీవి కంటే ముందు సుధాకర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. సుధాకర్ నటించిన తొలి చిత్రం కిజక్కే పోగుమ్ రైల్. 

అదే సమయంలో పునాదిరాళ్లు చిత్రానికి కూడా సుధాకర్ సైన్ చేశాడు. తన కథకు ఫ్రెష్ ఫేస్ ని కోరుకుంటున్న దర్శకుడు భారతీరాజా... పునాదిరాళ్ళు మూవీలో నటిస్తే, నీకు నా మూవీలో ఛాన్స్ ఇవ్వను అన్నాడట. అప్పట్లో భారతీరాజా మూవీలో ఆఫర్ అంటే చిన్న విషయం కాదు. కొత్త నటులతో సరికొత్త ప్రయోగాలు చేసి క్లాసిక్ హిట్స్ ఇస్తున్నాడు. భారతీరాజా మూవీ వదులుకోలేక, అటు పునాదిరాళ్ళు దర్శక నిర్మాతలకు చేయను అని చెప్పలేక సుధాకర్ సతమతం అవుతున్నాడట. 
 


Sudhakar

ఒకరోజు చిరంజీవితో ఈ విషయం చెప్పాడట సుధాకర్. రేయ్... పునాదిరాళ్ళు మూవీలో నటిస్తే నా మూవీలో నీకు ఛాన్స్ ఇవ్వనని భారతీరాజా అంటున్నాడు. పునాదిరాళ్ళు నిర్మాతలతో మాట్లాడాలి, నువ్వు తోడుగా వచ్చి మాట్లాడు అన్నాడట సుధాకర్. సరే అని చిరంజీవి వెళ్ళాడట. మావాడికి మంచి ఆఫర్ వచ్చింది. చేయను అంటున్నాడని చిరంజీవి వాళ్లతో చెప్పాడట. 

అదేంటయ్యా ఫిబ్రవరిలో మేము షూటింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు చేయను అంటే ఎలా, చేయాల్సిందే అన్నారట. లేదంటే నువ్వు మా సినిమాలో నటించు అని చిరంజీవిని అన్నారట. నేను ఇంకా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లోనే ఉన్నాను. కోర్స్ పూర్తి కాలేదు. చేయడం కుదరదు అన్నాడట చిరంజీవి. ఆ నెక్స్ట్ డే పొద్దున్నే చిరంజీవి రూమ్ దగ్గరకు పునాదిరాళ్ళు టీమ్ వచ్చారట. 
 

Sudhakar

ఇక స్నేహితుడి కోసం పునాదిరాళ్ళు మూవీలో నటించేందుకు చిరంజీవి ఒప్పుకున్నాడట. రాజమండ్రిలో మొదటిసారి కెమెరా ముందుకు ఆ చిత్రం కోసం చిరంజీవి వచ్చాడట. పునాదిరాళ్ళు మూవీ ఆలస్యం కావడంతో చిరంజీవి తర్వాత సైన్ చేసిన ప్రాణం ఖరీదు విడుదలైంది. 

ఇక సుధాకర్ భారతీ రాజా దర్శకత్వంలో చేసిన తమిళ చిత్రం కిజక్కే పోగుమ్ రైల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఏకంగా 365 రోజులు ప్రదర్శించారు. సుధాకర్ కి జంటగా రాధిక నటించింది. తెలుగులో తూర్పు వెళ్లే రైలు టైటిల్ తో రీమేక్ చేశారు. ఈ మూవీతో సుధాకర్ ఓవర్ నైట్ స్టార్ కాగా తెలుగు, తమిళ భాషల్లో హీరోగా అనేక చిత్రాలు చేశారు. వరుస పరాజయాల నేపథ్యంలో హీరోగా ఎదగలేక పోయాడు.  అనంతరం విలన్, కమెడియన్ గా వందల చిత్రాల్లో నటించాడు.
 

మరోవైపు చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగాడు. ఏకంగా టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయ్యాడు. చిరంజీవి తన స్నేహితుడైన సుధాకర్ కి ప్రతి చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. చిరంజీవి 90లలో నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో సుధాకర్ ఉంటాడు. విలన్, కామెడీ విలన్ రోల్స్ కి సుధాకర్ ఫేమస్ అయ్యాడు. 

Sudhakar

ఇటీవల సుధాకర్ గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సుధాకర్ పిల్లలు చిత్ర పరిశ్రమకు రాలేదు. తెలుగు ప్రేక్షకులు సుధాకర్ ని చాలా కాలం క్రితమే మర్చిపోయారు. చాలా మంది తెలుగు కమెడియన్స్ చివరి రోజుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి

Latest Videos

click me!