కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్..థియేటర్స్ లో గోల గోల చేస్తున్న ఫ్యాన్స్

Published : Jun 28, 2025, 11:24 AM IST

కన్నప్ప సినిమాలో ప్రభాస్ పెళ్లి డైలాగ్ పై థియేటర్లలో అభిమానులు హంగామా చేశారు. ఓ సన్నివేశంలో భాగంగా మంచు విష్ణు ప్రభాస్ ని పెళ్లి గురించి ప్రశ్నిస్తాడు.

PREV
15

మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం శుక్రవారం రోజు విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మంచు విష్ణు క్లైమాక్స్ లో  అద్భుతమైన నటన ప్రదర్శించినట్లు ప్రశంసలు దక్కుతున్నాయి. కానీ ఫస్టాఫ్ లో ఈ చిత్రంలో కొన్ని లోపాలు ఉన్నట్లు కూడా ఆడియన్స్ చెబుతున్నారు. ఈ మూవీ భారీ బడ్జెట్లో రూపొందడంతో లాంగ్ రన్ లో ఏ మేరకు వసూళ్లు సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

25

ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, ప్రభుదేవా, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని నిలబెట్టింది ప్రభాస్ పాత్రే అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి సెకండ్ హాఫ్ లో ప్రభాస్ పాత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాత మూవీ స్వరూపమే మారిపోతుంది. ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కథ కంప్లీట్ గా ఎంగేజింగ్ మారుతుంది.

35

ప్రభాస్, మంచు విష్ణు మధ్య సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. సర్ప్రైజింగ్ గా ఈ చిత్రంలో ప్రభాస్ పెళ్లి టాపిక్ కి సంబంధించిన డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఆ డైలాగ్స్ వచ్చినప్పుడు ప్రభాస్ అభిమానులు థియేటర్ లో ఒక రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. ఓ సన్నివేశంలో భాగంగా మంచు విష్ణు ప్రభాస్ ని పెళ్లి గురించి ప్రశ్నిస్తాడు. నీకు పెళ్లి అయ్యిందా అని అడుగుతాడు. దీనికి ప్రభాస్ రుద్ర పాత్రలో 'నా పెళ్లి గురించి నీకెందుకులే' అని బదులిస్తాడు. అతడికి పెళ్లి కాలేదని అర్థం చేసుకున్న తిన్నడు(మంచు విష్ణు).. పెళ్లి చేసుకుని ఉంటే తెలిసేది అంటూ కౌంటర్ ఇస్తాడు.

45

ఈ డైలాగు వచ్చినప్పుడు అభిమానులు విజిల్స్ కొడుతూ, చప్పట్లు కేరింతలతో ఒక రేంజ్ లో హంగామా చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ పెళ్లి టాపిక్ అనేది దేశవ్యాప్తంగా అంతలా వైరల్ గా మారింది. 45 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ప్రభాస్ ఇంతవరకు పెళ్లి ఊసు ఎత్తడం లేదు. పెళ్లి గురించి ఎప్పుడు ప్రశ్న ఏదైనా ప్రభాస్ తప్పించుకోవడం చూస్తూనే ఉన్నాం. కన్నప్ప చిత్రంలో కూడా అదే తరహా డైలాగ్ పెట్టారు.

55

గతంలో ప్రభాస్ అనుష్క గురించి చాలా రూమర్స్ వచ్చాయి. తమ గురించి జరుగుతున్న ప్రచారాన్ని వీళ్ళిద్దరూ ఖండించారు. ఆ తర్వాత ప్రభాస్ పెళ్లి గురించి మరికొన్ని రూమర్స్ వచ్చాయి. ఆంధ్ర కి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆ ఊసే లేదు. ఏదేమైనా ప్రభాస్ పెళ్లి కోసం అభిమానుల నిరీక్షణ అయితే తప్పడం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories