ప్రభాస్.. ప్రస్తుతం ఇండియాలో టాప్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. ఆయన సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా వెయ్యి కోట్లు ఈజీగా వసూలు చేస్తున్నారు. చివరగా `కల్కి 2898 ఏడీ` సినిమాతో అలరించిన డార్లింగ్ చేతిలో ఇప్పుడు ఆరు సినిమాలున్నాయి. అందులో `ది రాజా సాబ్` మొదట విడుదల కానుంది.
ఆ తర్వాత హను రాఘవపూడి `ఫౌజీ`, దాని తర్వాత సందీప్ రెడ్డి వంగా `స్పిరిట్`, అలాగే `సలార్ 2`, `కల్కి 2` చిత్రాలు తెరకెక్కి విడుదల కానున్నాయి. ఇవి కాకుండా లోకేష్ కనగరాజ్‌తో, ప్రశాంత్ వర్మతోనూ సినిమాలున్నట్టు టాక్. ఇవి రిలీజ్ కావడానికి మరో మూడు, నాలుగేళ్లు పడుతుంది. అప్పటి వరకు ప్రతి ఏడాది ఓ జాతరే అని చెప్పొచ్చు.