'కల్కి 2898 AD' ట్విట్టర్ రివ్యూ.. క్లైమాక్స్ ఊహకి కూడా అందదు, బాహుబలిని మించే పాన్ ఇండియా హిట్ పడ్డట్లేనా

First Published Jun 27, 2024, 3:51 AM IST

మహాభారతంలోని కొన్ని అంశాలని కలియుగానికి కనెక్ట్ చేస్తూ కల్కి అవతరించే క్రమంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే అంశాలని నాగ్ అశ్విన్ తన విజన్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. తన విజన్ కి ఫిక్షన్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కావడం, పైగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో కావడంతో అంచనాలు ఊహకందని విధంగా పెరిగాయి. దీనికి తోడు ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సాహసం చేశారు. టీజర్స్, ట్రైలర్ లో హాలీవుడ్ స్థాయి విజువల్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. 

హిందూపురాణం మహాభారతంలోని కొన్ని అంశాలని కలియుగానికి కనెక్ట్ చేస్తూ కల్కి అవతరించే క్రమంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే అంశాలని నాగ్ అశ్విన్ తన విజన్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. తన విజన్ కి ఫిక్షన్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ ఇలా ఇండియా సినిమాలో క్రేజీ స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి విజయం అందుకుంటుంది అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. 

ఆల్రెడీ యూఎస్ లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఏపీ తెలంగాలో కూడా ప్రీమియర్స్, ఎర్లీ మార్నింగ్ షోలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో ఆడియన్స్ నుంచి కల్కి చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది.. అంచనాలని అందుకునేలా కల్కి ఉందా ? అనే విషయాలు చూద్దాం. సరిగ్గా 3 గంటల 1 నిమిషం నిడివిగల కల్కి చిత్రం మహాభారతంలోని సన్నివేశాలతో ప్రారంభం అవుతుంది. 

ఈ సన్నివేశాలలో అశ్వథామ పాత్రని ప్రధానంగా చూపిస్తారు. ఆ తర్వాత మహాభారతం కాలం నుంచి కథ కలియుగంలో 2898 AD కి మారుతుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. కాంప్లెక్స్ రూలింగ్ లో శంబాలా ప్రజలు పడే కష్టాలని హైలైట్ చేస్తూ చూపించారు. అక్కడక్కడ  సర్ప్రైజింగ్ కామియో రోల్స్  ఉంటాయి. కాస్త ఆలస్యంగా అయినా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన విధానం విజిల్స్ కొట్టించే విధంగా ఉంటుంది. సినిమా మొదలైన అరగంట తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. 

ప్రభాస్ పాత్రని కాస్త ఫన్నీగా చూపిస్తూనే.. ఎంట్రీ సీన్ ని నాగ్ అశ్విన్ చాలా క్రేజీగా రూపొందించారు. ప్రభాస్ ఎంట్రీ కి ఫ్యాన్స్ సీట్లల్లో కూర్చోవడం కష్టమే. ఆ తర్వాత కమల్ హాసన్ పాత్ర ఉంటుంది. కమల్ హాసన్ పాత్ర, ఆ విజువల్స్ చూపించిన విధానం నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. 

ఫస్ట్ హాఫ్ లో పాత్రలని పరిచయం చేస్తూ నెమ్మదిగా కథని నడిపించిన నాగ్ అశ్విన్ ఇంటర్వెల్ బ్లాక్ లో ఒక్కసారిగా విస్ఫోటనం సృష్టించాడు.  ఫస్ట్ హాఫ్ లో విజువల్స్ అయితే ఇండియన్ సినిమాలో ఇంతవరకు చూడని విధంగా ఉన్నాయి. అదే విధంగా నాగ్ అశ్విన్ సెట్ చేసిన సెటప్ కూడా చాలా కొత్తగా ఉంది.స్టోరీ లైన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ నాగ్ అశ్విన్ స్క్రీన్ ప్లే చాలా స్లో. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ కి తక్కువ స్క్రీన్ స్పేస్ దొరకడం కూడా ఒక మైనస్. 

ఇక సెకండ్ హాఫ్ లో యాక్షన్ సన్నివేశాలు ప్రధానంగా ఉంటాయి. డ్రామా నడిపిస్తూనే యాక్షన్ కూడా కళ్ళు చెదిరేలా ఉంటుంది. దీపికా పదుకొనె ఇన్వాల్వ్ అయిన యాక్షన్ సీన్ కూడా సెకండ్ హాఫ్ లో ఉంది. ఇక క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమా స్వరూపాన్ని క్లైమాక్స్ మార్చేసింది అని చెప్పొచ్చు. గూస్ బంప్స్ తెప్పించే విధంగా నాగ్ అశ్విన్ క్లైమాక్స్ ని సిద్ధం చేశారు. 

ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా తీసుకోవడంలో నాగ్ అశ్విన్ అక్కడక్కడా తడబడ్డారు. కానీ విజువల్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. యాక్షన్ ఎపిసోడ్స్ ఆ మైనస్ లని కవర్ చేశాయి. దిమ్మ తిరిగే ట్విస్ట్ తో క్లైమాక్స్ లో నాగ్ అశ్విన్ కల్కి చిత్ర సీక్వెల్ కి హింట్ ఇచ్చారు. మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ పై ప్రభాస్ దండయాత్ర మొదలైనట్లు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. 

Latest Videos

click me!