మాట తప్పిన అనసూయ మళ్ళీ ఊపేస్తుందిగా... ఈ నిర్ణయానికి కారణం ఏమిటో?

Published : Jun 26, 2024, 08:29 PM IST

అనసూయ భరద్వాజ్ మాట తప్పింది. ఇకపై ఆ తప్పు చేయనని చెప్పి అదే పని చేస్తుంది. అనసూయ నిర్ణయం వెనుక కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది...   

PREV
16
మాట తప్పిన అనసూయ మళ్ళీ ఊపేస్తుందిగా... ఈ నిర్ణయానికి కారణం ఏమిటో?
Anasuya Bharadwaj

అనసూయ భరద్వాజ్ నటిగా ఫుల్ బిజీ. గత  ఏడాది ఆమె నటించిన ఐదారు చిత్రాలు విడుదలయ్యాయి. మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాల్లో అనసూయ విలక్షణ పాత్రలు చేసింది. 

26
anasuya insta pics

అనసూయ నటించిన పుష్ప 2 విడుదల కావాల్సి ఉంది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ చిత్రం డిసెంబర్ 24కి వాయిదా పడింది. ఈ మూవీలో లేడీ విలన్ రోల్ చేసింది ఆమె. అలాగే పెదకాపు పార్ట్ 2 సైతం సెట్స్ పైకి వెళ్లినట్లు సమాచారం. మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. 

 

36

వరుస ఆఫర్స్ వస్తుండగా బుల్లితెర ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది అనసూయ. కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ పేరుతో మొదలైన గేమ్ షోలో బోల్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ప్రోమోలో అనసూయ జాకెట్ తీసేయడం మరోసారి వివాదాస్పదం అయ్యింది. అనసూయ ఎప్పటిలానే సమర్ధించుకుంది. 

46

అయితే అనసూయ మాట తప్పింది. ఆమె గతంలో బుల్లితెర షోలు చేసేది లేదని తెగేసి చెప్పింది. ఆన్లైన్ చాట్ లో పాల్గొన్న అనసూయను మళ్ళీ ఎప్పుడు యాంకరింగ్ చేస్తారని ఓ నెటిజన్ అడిగారు. చెత్త టీఆర్పీ స్టంట్స్ ముగిసే వరకు యాంకరింగ్ చేసేది లేదని అనసూయ అన్నారు. 
 

56

షో ఏదైనా టీఆర్పీ స్టంట్స్ లేకుండా ఉండవు. అనసూయ జాకెట్ విప్పేసింది కూడా ఆ టీఆర్పీ స్టంట్ లో భాగమే. అనసూయ చేసిన పని కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్   ప్రోమోకి ఎక్కడలేని ప్రచారం దక్కింది. సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయ్యింది. చేయనన్న పని చేస్తూ... అదే టీఆర్పీ స్టంట్ చేసింది అనసూయ. 

 

 

66
anasuya instagram

జబర్దస్త్ వంటి క్రేజీ షో మానేసిన అనసూయ స్టార్ మా లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. జబర్దస్త్ మానేయడానికి అనసూయ పెద్ద కారణమే ఉంది. ఆ సంస్థలో చెప్పుకోదగ్గ స్థాయిలో రెమ్యూనరేషన్స్ ఉండవు. స్టార్ మా గట్టిగా ముట్టచెప్పడంతో మరలా యాంకరింగ్ కి ఒప్పుకుని ఉంటుంది. డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి. 

Read more Photos on
click me!

Recommended Stories