రజనీ `2.0`తో ప్రభాస్‌ `కల్కి`కి లింక్‌.. కమల్‌ హాసన్‌ పాత్రలో మరో కోణం? నాగ్‌ అశ్విన్‌ స్కెచ్‌ వేరే లెవల్‌ ?

First Published Jul 3, 2024, 6:40 PM IST

ప్రభాస్‌ నటించిన `కల్కి 2898ఏడీ` బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. అయితే ఈ సినిమా రజనీకాంత్‌ నటించిన `2.0` చిత్రానికి లింక్‌ ఉన్నట్టు తెలుస్తుంది. 
 

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన `2.0` ఆరేళ్ల క్రితం వచ్చి ఆకట్టుకుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. `రోబో`కి సీక్వెల్‌గా దర్శకుడు శంకర్‌ ఈ మూవీని రూపొందించారు. ఇందులో రజనీకాంత్‌ రోబోగా, అక్షయ్‌ కుమార్‌ నెగటివ్‌ రోల్ లో కనిపించారు. చివరగా ఈ ఇద్దరి మధ్య భీకరంగా సాగుతుంది. సినిమాకి హైలైట్‌గా నిలిచింది. 

2.0 మూవీ స్టిల్స్

ఇందులో అక్షయ్‌ కుమార్‌ ప్రకృతి ప్రేమికుడిగా నటించారు. పక్షులు, జీవరాశులను టెక్నాలజీ, ఫోన్‌ సిగ్నల్స్ తో ప్రజలు, ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయి. అవసరం మించిన, ప్రకృతికి విఘాతం కలించే స్థాయిలో సిగ్నల్‌ ప్రీక్వెన్సీ ఇచ్చి అనేక పక్షి జాతులునాశనం కావడానికి కారణమవుతుందనే కాన్సెప్ట్ తో అక్షయ్‌ కుమార్‌ పాత్రని డిజైన్‌ చేశారు శంకర్‌. పైకి నెగటివ్‌గా కనిపించినా, ఓరకంగా ఆయన పాత్రనే హీరో. ప్రకృతి కోసం, ప్రజల కోసం ఆయన పోరాడుతున్నాడు. ఈ క్రమంలో రోబో(రజనీ)తోనూ పోరాడతాడు. ప్రజల కోసమైనా, ప్రకృతి కోసమైనా చట్టాలను చేతుల్లోకి తీసుకోవడం నేరం కాబట్టి అందులో అక్షయ్‌ కుమార్‌ రోల్‌ నెగటివ్‌గా కనిపిస్తుంది. 

Latest Videos


ఈ కాన్సెప్ట్ ఇప్పుడు `కల్కి 2898ఏడీ`లోనూ కనిపిస్తుంది. ప్రభాస్‌ నటించిన ఈ మూవీకి కూడా సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదెలా అనేది చూస్తే, `కల్కి` చిత్రంలో కాంప్లెక్స్ అనే ఓ ప్రపంచాన్ని సృష్టించాడు సుప్రీం యాస్కిన్‌(కమల్‌ హాసన్‌). భూమిలోని జీవరాశినంతా ఆయన లాక్కుంటాడు. నీరు, ఫుడ్‌, ప్రైమరీ నీడ్స్ అన్నీ ఆయన కంట్రోల్‌లోనే ఉంటాయి. ఒక మిలియన్‌ యూనిట్స్ సంపాదించిన వారికి దానిలోకి పర్మీషన్‌ ఉంటుంది. అందులో సకల వసతులు, వైభోగాలు, ఓ రకంగా లగ్జరీ లైఫ్‌ని అనుభవించవచ్చు. 

భూమి అంతా ఎడారిగా ఉంటుంది. జనం జీవచ్ఛవాలుగా ఉంటారు. యూనిట్స్ కోసం ఒకరినొకరు అమ్ముకునే పరిస్థితి నెలకొంది. అవన్నీ కమల్‌ హాసన్‌ పాత్ర కంట్రోల్‌లో ఉంటాయి. సుప్రీం యాస్కిన్‌ బాడీ క్షీణించిన దశలో ఉంటాడు. చావుకి చివరి దశలో కనిపిస్తుంటాడు. ఆయన మహిళల గర్భం నుంచి తీసిన సీరం కోసం ప్రాజెక్ట్ కే ప్రయోగాలు చేస్తుంటాడు. ఆ సీరం ద్వారా తిరిగి తాను మామూలు మనిషి కావాలనేది ఆయన లక్ష్యంగా సినిమాలో చూపించారు. 
 

Yaskin Kalki 2898 AD

అయితే ఇందులో కమల్‌ హాసన్‌ సైంటిస్ట్ తో ఓ మాట అంటాడు. ప్రకృతిని నాశనం చేస్తున్నారని, మనిషికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారడం లేదని, అందుకే ఆ జీవరాశులను తాను లాక్కున్నట్టు చెబుతాడు. అంటే సుప్రీం యాస్కిన్‌  మరో కోణంలో ప్రకృతి ప్రేమికుడిగా కనిపిస్తున్నాడు. మనిషి ప్రకృతి, సహజ వనరులను నాశన చేస్తున్న నేపథ్యంలో యాస్కిన్‌ మనిషికి అవి దక్కకుండా, వాటి విలువ తెలిసేలా చేస్తున్నాడనేది ఇందులో కమల్‌ పాత్ర ద్వారా చెప్పారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఇలా చూస్తే కమల్‌ పాత్రలో హీరోయిజం కనిపిస్తుంది. 

ఈ కోణంలోనే `కల్కి 2898ఏడీ`కి రజనీకాంత్‌ `2.0`కి సంబంధం ఉందని, రెండు చిత్రాల్లో విలన్‌ రోల్స్ ఒకేలా ఉన్నాయని అర్థమవుతుంది. అయితే `కల్కి`లో ఆ విషయాన్ని కేవలం ఒక్క సీన్‌లోనే చూపించారు. `కల్కి 2`లో ఆ విషయాలను మరింత క్లుప్తంగా వివరించే అవకాశం ఉంది. రెండో పార్ట్ లో ప్రభాస్‌కి, యాస్కిన్‌కి మధ్య యుద్ధమే ప్రధానంగా సాగుతుందని, అందులో భాగంగానే అసలు కాంప్లెక్స్ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాల్సి వచ్చిందో యాస్కిన్‌ తెలియజేసే అవకాశం ఉంది. అంతిమంగా అధర్మంగా చేసిన ఈ పనికి `కల్కి` వచ్చి ధర్మం కోసం పోరాడుతాడని, ఈ క్రమంలో యాస్కిన్‌ సామ్రాజ్యాన్ని అంతం చేస్తాడని చెప్పొచ్చు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

ప్రభాస్‌ హీరోగా  నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన `కల్కి 2898ఏడీ` సినిమా మాత్రం ఇప్పుడు బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.650 కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. వెయ్యి కోట్ల దిశగా వెళ్తుంది. లాంగ్‌ రన్‌లో ఇది `ఆర్‌ఆర్‌ఆర్‌` దగ్గరకు రీచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా, దీపికా పదుకొనె సుమతిగా, శోభన, రాజేంద్రప్రసాద్‌ రెబల్స్ నాయకులుగా, దిశా పటానీ ప్రభాస్‌ లవ్‌ ఇంట్రెస్ట్ గా, బ్రహ్మానందం ఇంటి హోనర్‌గా నటించారు. వీరితోపాటు గెస్ట్ లుగా విజయ్‌ దేవరకొండ అర్జునుగా, దుల్కర్‌ సల్మాన్‌ పైలట్‌గా నటించిన విషయం తెలిసిందే. 

click me!