మొదట్లో శ్రీసత్య ఎవరితో మాట్లాడేది కాదు. చాలా సైలెంట్ గా ఉండేది. తనకు బ్రేకప్ అయ్యిందని, అప్పటి నుండి నేను ఇలా తయారయ్యానని చెప్పుకొచ్చేది. బిగ్ బాస్ హౌస్లో సైలెంట్ గా ఉంటే కుదరదు కాబట్టి... నాగార్జున ఆమెకు లైట్ గా క్లాస్ పీకాడు. రెండో వారం నుండి పుంజుకున్న శ్రీసత్య తన మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. హౌస్లో అర్జున్ కళ్యాణ్ అనే ఒక అమాయకుడు ఉండేవాడు. అతన్ని గట్టిగా వాడేసింది.