ఒక్కసారిగా బాలయ్య, వెంకటేష్ బాక్సాఫీస్ పై దాడి.. చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ మిస్, ఆ మూవీ ఏంటంటే

First Published Jul 3, 2024, 5:52 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారు. అందులో ఖైదీ, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. 

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారు. అందులో ఖైదీ, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. అదే విధంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించి తృటిలో ఇండస్ట్రీ హిట్ మిస్ అయిన చిత్రాలు కూడా ఉన్నాయి. 

అలా ఇండస్ట్రీ హిట్ చేజారిన చిత్రాల్లో అన్నయ్య ఒకటి. ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ, నటుడు వెంకట్ చిరంజీవికి బ్రదర్స్ గా నటించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. చిరంజీవి కామెడీ టైమింగ్, మేనరిజమ్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. 

Latest Videos


ఈ చిత్రంలో సిమ్రాన్ చేసిన స్పెషల్ సాంగ్ మాస్ ఆడియన్స్ ని బి, సి సెంటర్స్ లో ఊపేసింది. చిరంజీవి, సౌందర్య మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక బ్రదర్స్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. మణిశర్మ ఈ చిత్రానికి ఆల్ టైం క్రేజీ ఆల్బమ్ ఇచ్చారు. 

2000 సంవత్సరంలో జనవరి 4న ఈ చిత్రం రిలీజయింది. ఈ చిత్రంలో ప్రతి అంశం వర్కౌట్ కావడంతో తొలి వారంలోనే 4 కోట్ల షేర్ రాబట్టింది. భారీ హిట్ ఖాయం అనుకున్నారు. రెండవ వారంలో కూడా వసూళ్ల ప్రభంజనం కురిసింది. చిరు ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పడుతోందా అని అనుకుంటున్న తరుణంలో రెండు వారాల తర్వాత వెంకటేష్ కలిసుందాం రా చిత్రం విడుదలయింది. 

కలిసుందాంరా చిత్రానికి క్లాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీనితో అన్నయ్య చిత్రానికి గట్టి పోటీ ఎదురైంది. కలిసుందాంరా చిత్రానికి క్లాస్ ఆడియన్స్ తో పాటు మహిళలు కూడా ఎగబడ్డారు. ఫలితంగా అన్నయ చిత్రానికి వసూళ్లు తగ్గిపోయాయి. 

అదే సమయంలో బాలయ్య నటించిన వంశోద్ధారకుడు చిత్రం థియేటర్స్ లో ఉంది. మరోవైపు మోహన్ బాబు మాస్టర్ చిత్రంతో వచ్చారు. ఫలితంగా చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ మూవీ జస్ట్ మిస్. ఏది ఏమైనా ఆడియన్స్ ఎప్పుడు చూసిన మంచి వినోదం అందించే చిత్రం అన్నయ్య. 

click me!