“దేవర”కొత్త పోస్టర్ పై ట్రోల్స్.. ఏంటిది కొరటాలా.. ?

First Published | Aug 3, 2024, 7:50 AM IST

ఆర్.ఆర్.ఆర్ తర్వాత వస్తున్న చిత్రం కావటంలో .. దేవర అప్డేట్స్ మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వచ్చిన ఫియర్ సాంగ్ యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 
 

Devara


స్టార్ హీరోల సినిమాల విషయంలో ప్రతి చిన్నదాన్ని జనం బూతద్దంలోంచి చూస్తారు. ముఖ్యంగా ప్రమోషన్ ట్రైలర్స్, పోస్టర్,టీజర్స్ అన్ని ఫ్యాన్స్ తో యాంటీ ఫ్యాన్స్ నిశితంగా పరిశీలిస్తూంటారు. యాంటీ ప్యాన్స్ ఇంకాస్త ఎక్కువగానే పట్టించుకుని ఏదైనా చిన్న పొరపాటు ఉన్నా వెంటనే హైలెట్ చేస్తూ సినిమాని సోషల్ మీడియాలో ఆడేసుకుంటూంటారు. సినిమాపై నెగిటివ్ ఇంప్రెషన్  వచ్చేలా చేస్తూంటారు. ఇవి ఎన్టీఆర్ కు, కొరటాల కు తెలియనివి కాదు. కానీ ఎందుకో పొరపాట్లు జరిగిపోతున్నాయి. తాజాగా పోస్టర్ రిలీజ్ చేస్తే అదీ ట్రోలింగ్ కు గురి అవుతోంది. 

Devara
 ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్న చిత్రం  దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం తెలుగు వాళ్లు మాత్రమే కాకుండా యావత్ దేశం ఎదురుచూస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత వస్తున్న చిత్రం కావటంలో .. దేవర అప్డేట్స్ మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం వచ్చిన ఫియర్ సాంగ్ యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 

Latest Videos



ఇప్పటికీ “దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక” అంటూ తారక్ ఫ్యాన్స్ టాప్ లేపేస్తున్నారు. అయితే.. దేవర నుండి సెకండ్ సింగిల్ ఎప్పుడు అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రానుంది. రిలీజ్ పరంగా ఎలాంటి అవాంతరాలు లేవు. ప్రమోషన్ విషయంలోనే కాస్త స్లోగా ఉన్నారనే చెప్పాలి.
 

Devara update


ఈ క్రమంలో  సెకండ్ సింగిల్ పై అప్డేట్ కావాలంటూ వారం రోజులుగా ట్విట్టర్ లో హీట్ పుట్టిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ దేవర టీమ్ దిగి వచ్చింది. మూవీ నుండి సెకండ్ సాంగ్ పై ఓ రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసి కూల్ అప్డేట్ ఇచ్చింది. రిలీజైన పోస్టర్ లో జాన్వీ దేవకన్యలా మెరిసిపోతుండగా.., జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కూల్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఆగస్టు 5న ఈ సెకండ్ సింగిల్ రిలీజ్ కాబోతున్నట్టు పోస్టర్ లో తెలియచేశారు.


ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, జాన్వీ కెమిస్ట్రీ అదిరింది. ఈ పాటను లావిష్ గా గ్రీన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తీసారని తెలుస్తోంది. అయితే పోస్టర్ ఎడిటింగ్ లోనే సమస్య కనపడుతోందంటున్నారు. ఎన్టీఆర్ కాళ్లు ఈ పోస్టర్ లో ఆశ్చర్యకరంగా మాయమయ్యాయి. అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, పెద్ద డైరక్టర్, ఇంత చిన్న విషయం గమనించకపోవటం ఆశ్చరం అంటున్నారు. అసలు తమ సినిమాకి చెందిన పోస్టర్ బయిటకు వెళ్తుంటే ఫైనల్ చేసేముందు చూసుకుంటారు కదా..ఎలా మిస్సయ్యారు అంటున్నారు. అయితే ఇదే మొదటి సారి కాదు..ఇంతకు ముందు రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా కాళ్లు కనపడలేదు. 
 


ఈ కాళ్లు కనపడకపోవటం అనేది అడ్డం పెట్టుకుని కొంతమంది యాంటీ ప్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే ఇందులో ఎన్టీఆర్ కాళ్లు ఉండవా అంటూ వెటకారం చేస్తున్నారు. ఇది ఫ్యాన్స్ కు బాధ కలిగించే విషయమే. అలాగే ఇంతకు ముందు వదిలిన పోస్టర్ లో ఎన్టీఆర్ బోట్ లో కనపడతారు. దాన్ని మెగాస్టార్ నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య” పోస్టర్స్ తో పోల్చి చాలా మంది చూపించి రచ్చ చేసారు. పడవ మీద చిరంజీవి పోస్టర్ కూడా వాల్తేరు వీరయ్య నుంచి ఉంటుంది. దీనితో దానిని కాపీ కొట్టినట్టుగా ఉందని కొందరు అన్నారు. 


దేవర చిత్రం తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్నారని సమాచారం. ఆయన తన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయం బయిటకు రాగానే వంశీకు భారీ గా రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. కేవలం అడ్వాన్స్ ఇచ్చి రైట్స్ పెట్టుకుని వంశీ ...డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దాంతో తన జేబులోంచి పడకుండానే వంశీకు మంచి లాభాలు రాబోతున్నట్లు చెప్తున్నారు.  అయితే ఈ విషయమై అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఏమీ లేదు.  దసరా సీజన్ లో టెర్రిఫిక్ బజ్ తో ఈ సినిమా రిలీజ్ కానుండటమే అందుకు కారణం. 


ఇక ఈ సినిమా ప్లస్ ల విషయానికి వస్తే... ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తున్న తారక్‌ సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం మరో ముఖ్య కారణం. ఆచార్యతో వెనక బడ్డ దర్శకుడు కొరటాల శివ ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఓ అద్భుత చిత్రంగా ‘దేవర’ను తీర్చిదిద్దుతున్నారనే టాక్ రావటం మరో ప్లస్  పాయింట్.  
 


ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దేవర టీమ్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యమైన నార్త్ థియేట్రికల్ రిలీజ్‌ కోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌‌ను రంగంలోకి దింపింది. "ఈ విషయాన్ని కరణ్ జోహార్ సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించారు. ఒక మాస్ తుపాను మనందరినీ ముంచేయడానికి త్వరలోనే రాబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో భాగం అయినందుకు గౌరవంగా భావిస్తున్నాను. నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమాలో బిగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి" అంటూ కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.


కరణ్ జోహార్‌తో పాటు AA ఫిలిమ్స్ సంయుక్తంగా నార్త్‌లో దేవర సినిమాను రిలీజ్ చేయబోతుంది. కరణ్ జోహార్‌ లాంటి నిర్మాత బాలీవుడ్‌లో దేవరను రిలీజ్ చేస్తుండటంతో దేవర మూవీ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. దీన్ని బట్టి చూస్తే దేవర సినిమాను నార్త్‌లో వీలైనంత ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
 

 దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.    ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  
 

‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న చిత్రం    'దేవర' .  ‘దేవర’లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.   దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. 
 


మరో ప్రక్క ఎన్టీఆర్ బాలీవుడ్ రంగప్రవేశానికి అంతా సిద్దమైంది.  'వార్ 2'తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. నందమూరి కుటుంబ వారసుడికి హిందీలో మంచి ఫాలోయింగ్ ఉందని అర్దం చేసుకున్న హిందీ నిర్మాణ సంస్దలు ఆయన్ని తమ సినిమాల్లో చేయమని అడుగుతున్నారు. ఇదంతా ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర బిజినెస్ కు కలిసి వస్తోంది. అక్కడ మీడియా ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతోంది. దాంతో ఎన్టీఆర్ దేవర కొనటానికి అక్కడ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇదేమీ ఇప్పుటికిప్పుడు వచ్చిన క్రేజ్ కాదు.  

click me!