ప్రభాస్ కి గాయం, ఫౌజీ షూటింగ్ లో ప్రమాదం, ఆందోళనలో అభిమానులు, అసలేమయ్యింది?

Published : Feb 16, 2026, 07:59 AM IST

ఫౌజీ షూటింగ్ లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ కు గాయం అవ్వడంతో షూట్ కు కొన్నిరోజులు బ్రేక్ పడినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ పరిస్థితి ఏంటి?

PREV
15
ప్రభాస్ కు గాయం..

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఫౌజీ షూటింగ్ లో చిన్న ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రభాస్ కు గాయాలు అయ్యాయట. గుర్రపు స్వారీకి సబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ప్రభాస్‌కు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. 

ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళనచెందుతున్నారు. అయితే ఇది చాలా చిన్న గాయమేనని, ఎలాంటి భయం అవసరం లేదని మేకర్స్ అంటున్నారు. ప్రభాస్ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మూవీ టీమ్ అంటున్నారు.

25
ప్రభాస్ విషయంలో ఎందుకిలా..?

ఈమధ్య కాలంలో ప్రభాస్ కు ప్రమాదాలు ఎక్కువయ్యాయి, గాయాలు తగలడం కామన్ గా మారిపోయింది. ఇంతకు ముందు కూడా ఫౌజీ సినిమా షూటింగ్ లోనే ప్రభాస్ రెండు సార్లు గాయపడ్డట్టు సమాచారం. గత ఏడాది జులైలో ప్రభాస్ కాలికి ఫ్యాక్చర్ అయిందన్న వార్తలు వచ్చాయి. 

అంతకు మందు కూడా షూటింగ్ లో కాలికి దెబ్బ తగలడంతో.. ఆయన చాలా కాలం షూటింగ్స్ కు గ్యాప్ తీసుకున్నారు. ఇటలీ వెళ్లి కాలుకు సర్జరీ కూడా చేయించుకుని వచ్చారు. ప్రతీ సారి షూటింగ్ లో ఇలా ప్రభాస్ కు గాయాలు తగలడం.. అభిమానులకు ఆందోళనకు గురి చేస్తోంది.

35
కీలక దశలో ఫౌజీ సినిమా షూటింగ్

ఫౌజీ సినిమా షూటింగ్ ప్రస్తుతం కీలక దశలో కొనసాగుతోంది. ఈ సినిమాలో భారీ స్థాయిలో యాక్షన్స్ సీన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా గుర్రపు స్వారీ సీన్‌తో పాటు హై వోల్టేజ్ చేజింగ్ సీన్స్ ను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. భారీ సెట్స్‌లో.. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ను ఉపయోగించి ఇవి రూపొందిస్తున్నట్లు సమాచారం. 

ఈ యాక్షన్ సీన్స్ విషయంలో ప్రభాస్ కోసం ప్రత్యేకంగా భద్రతా చర్యలు కూడా తీసుకున్నారట మేకర్స్. ప్రభాస్ కు గాయంతో కొన్ని రోజులు షూటింగ్ కు విరామం తప్పడంలేదు. అయితే ఈ లోపు ఇతర సన్నివేశాలను పూర్తి చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

45
సైనికుడి పాత్రలో ప్రభాస్..

హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీ మూవీ.. మేజర్ పార్ట్ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుసోంది. ‘Sita Ramam’తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హను.. అదే ప్లానింగ్ తో.. ఫౌజీ సినిమాపై కూడా పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. 

ఈ పాత్ర ఆయన అభిమానులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం చెబుతోంది. పెద్ద ప్రమాదం నుంచి చిన్న గాయంతో బయటపడ్డ ప్రభాస్ త్వరలోనే మళ్లీ షూటింగ్‌లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకుంటూ, ఫౌజీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

55
రాజా సాబ్ తో ఎదురుదెబ్బ..

ఇటీవల రాజా సాబ్ సినిమాతో ప్రభాస్ భారీ డిజాస్టర్‌ను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెట్టినట్లు సమాచారం. రాజా సాబ్ ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. 

అదే సమయంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాను కూడా ఇటీవల ప్రారంభించారు. స్పిరిట్ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేయాలనే లక్ష్యంతో ప్రభాస్ ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories