Akhanda 2 OTT:: బాలకృష్ణ హీరోగా నటించిన `అఖండ 2` సినిమా గతేడాది డిసెంబర్‌లో విడుదలై డిజాస్టర అయ్యింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంది. అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `అఖండ 2`. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన విషయం తెలిసిందే. ఆదిపినిశెట్టి, సంయుక్త, పూర్ణ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. 14రీల్స్ ప్లస్ ఈ మూవీని నిర్మించింది. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. ఈ మూవీ శివతత్వం ప్రధానంగా రూపొందింది. అయితే ఈ మూవీ థియేటర్లో ఆడలేదు. గతేడాది డిసెంబర్ 12న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ మూవీ అర్థిక కారణాలతో వాయిదా పడింది. వారం గ్యాప్ తర్వాత వచ్చింది.
25
అఖండ 2ని దెబ్బకొట్టిన ఆర్థిక ఇబ్బందులు
`అఖండ 2` సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టంది. ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. శివతత్వానికి సంబంధించిన క్లాస్ ఇవ్వడం ఎక్కువగా ఉందని, `అఖండ` మూవీ స్థాయిలో లేదని, బలవంతంగా దేవుడి గురించి చెప్పినట్టుగా ఉందని, రియాలిటీకి దూరంగా ఉందనే విమర్శలు వచ్చాయి. ఒక ప్రొపగండ మూవీగా చెప్పుకొచ్చారు. దీనికితోడు రిలీజ్ ఆలస్యం కావడం కూడా మూవీ ఆడకపోవడానికి కారణంగా చెప్పొచ్చు. థియేటర్లలో ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
35
ఓటీటీలో దుమ్మురేపుతున్న బాలయ్య `అఖండ 2`
అయితే ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. `అఖండ 2` నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది జనవరి 9న ఓటీటీలోకి వచ్చింది. ప్రారంభంలో ఓటీటీలో కూడా పెద్దగా ఆడలేదు. ఆడియెన్స్ పట్టించుకోలేదు. క్రమంలో ఇది పుంజుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా చూస్తున్నారు. ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా ఈ మూవీని ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు ఇండియా వైజ్‌గా టాప్ 10లోకి వచ్చింది. శివతత్వానికి చెందిన మూవీ కావడంతో ఆడియెన్స్ దీన్ని చూసేందుకు ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది.
నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఈ మూవీ కూడా మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నా ఇప్పుడు మాత్రం సత్తా చాటుతోంది. టాప్ 10లోకి దూసుకువచ్చింది. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలో దుమ్మురేపుతుంది. నెట్‌ఫ్లిక్స్ లో ఇండియా వైడ్‌గా టాప్ 10 మూవీస్‌లో ఇది తొమ్మిదో స్థానంలో ఉంది. ఓటీటీలోకి వచ్చి నెల రోజులు దాటిన తర్వాత కూడా టాప్ 10లో ట్రెండింగ్ కావడం విశేషం. ఈ మూవీ లేట్ గా అయినా లేటెస్ట్ గా ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.
55
నెట్ ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్
ఇక నెట్ ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 మూవీస్‌లో `ధురంధర్` మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో `తస్కరి`, మూడో స్థానంలో `గ్రేట్ ఇండియా కపిల్` షో, నాలో స్థానంలో `తేరే ఇష్క్ మెయిల్`, ఐదో స్తానంలో `స్ట్రేంజర్ థింగ్స్`, ఆరో స్థానంలో హక్`, ఏడో స్థానంలో `జాలీ ఎల్ ఎల్ బీ 3`, 8వ స్థానంలో `దే దే ప్యార్ దే 2`, తొమ్మిదో స్థానంలో `అఖండ 2`, పదో స్థానంలో ఓ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ ఉంది.