Jagapathi Babu: పెట్టెలో పెట్టి మర్చిపోయారు.. మరణగండం గురించి మతిపోయే విషయాలు బయటపెట్టిన జగపతిబాబు

Published : Feb 15, 2026, 10:02 PM IST

Jagapathi Babu: జగపతి బాబు మరణ గండం నుంచి తప్పించుకున్నారు. సినిమా షూటింగ్‌లో ఆయన్ని నిజంగానే పెట్టేలో పెట్టి మర్చిపోయారట. ఊపిరి ఆడక చాలా ఇబ్బంది పడ్డారట. ఇలా షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టారు జగపతిబాబు. 

PREV
15
టాలీవుడ్‌లో రొమాంటిక్‌ హీరో జగపతిబాబు

జగపతిబాబు ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించారు. ఫ్యామిలీ చిత్రాలతో మెప్పించారు. టాలీవుడ్‌లో రొమాంటిక్‌ హీరో అనే పేరు కూడా ఉంది. ఆయనతో చాలా మంది హీరోయిన్లకి ఎఫైర్లు ఉన్నాయని అంటుంటారు. కానీ అమ్మాయిలు, ఆడవాళ్లు అంటే తనకు ఇష్టమని, వారిని గౌరవిస్తానని చెబుతూ కవర్‌ చేసుకుంటున్నారు జగపతిబాబు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టారు.

25
`జగపతి` సినిమాలో షాకింగ్‌ ఇన్సిడెంట్‌

డెస్టినీ గురించి చెబుతూ, తన మరణగండాన్ని వెల్లడించారు. తాను చనిపోవాల్సింది బతికిపోయాడట. `జగపతి` సినిమా షూటింగ్‌లో జరిగిన సంఘటన బయటపెట్టారు జగపతిబాబు. ఆ మూవీ ఎండింగ్‌ సీన్ లో తనని పెట్టెలో పెట్టి భూమిలో పూడ్చాల్సి ఉందట. అలానే పెట్టెలో పెట్టి మేకుల కొట్టి భూమిలో పెట్టారు. దానిపై మండపం ఉంటుంది. ఆ సీన్‌ని   రియల్‌గానే చేశారట. జగపతిబాబుని పెట్టేలో పెట్టి పూడ్చారు. అయితే ఆ పెట్టెకి ఏమాత్రం గ్యాప్‌ లేదట. దీంతో గాలి రాక ఊపిరి ఆడలేదట.

35
జగపతిబాబు చనిపోయారని అంతా షాక్‌

ఆ సీన్‌ అయిపోయిన తర్వాత తాను ఉన్న పెట్టెని భూమిలో నుంచి తీసి ఎక్కడో పెట్టి మర్చిపోయారట. దీంతో ఊపిరితీసుకోవడం కష్టంగా మారిందట. కాసేపు తర్వాత చూశారు. కాసేపటి వరకు తాను లేవకపోవడంతో అంతా షాక్‌ అయ్యారు. అప్పటికే  తాను చనిపోనని అంతా భావించారట. ఏడవడం స్టార్ట్ చేశారట.  `ఆ తర్వాత కొద్ది సేపటికి లేచాను. అయితే ఆ రోజు మరో సంఘటన జరిగింది. ఉదయం పదకొండు గంటల సమయంలో ఓ లేడీ ఆస్ట్రాలజర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఆమె మీరు బాగానే ఉన్నారా అని అడిగింది. జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.

45
ఆస్ట్రాలజర్‌ కి ముందే ఈ విషయం తెలుసు

ఆమె ఫోన్‌ చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ విషయం తెలిసి ఆమె మళ్లీ ఫోన్‌ చేసింది. మీకు మరణగండం ఉందండి, మీరు పోయేవారు అని, పోతారని భయం వేసి మార్నింగ్‌ ఫోన్‌ చేశాన`ని తెలిపిందట. అయితే ఆమె ఈ విషయాన్ని ముందే చెప్పలేదు. చెబితే జాగ్రత్త పడేవాడిని అని చెప్పారు జగపతిబాబు. తాజాగా ఆయన `రా టాక్స్ విత్‌ వీకే` అనే యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన పాడ్‌ కాస్ట్ ఇంటర్వ్యూలో  ఈ విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రి విషయంలో జరిగిన సంఘటన కూడా వెల్లడించారు.

55
జగపతిబాబు తండ్రికి మరణగండం

ఆయనకు ప్రతి పదేళ్లకి మరణగండం ఉందట. అయితే ఓ సారి ముంబయి నుంచి ఫ్లైట్‌లో హైదరాబాద్‌ రావాల్సి ఉంది. ఆ ఫ్లైట్‌ బయలు దేరింది, క్రాష్‌ అయి అంతా చనిపోయారు. కానీ నాన్న మాత్రం బతికే ఉన్నారు. కారణం ఆ రోజు ఫ్లైట్‌ డిలే అవుతుందని, ఆయన ఫ్రస్టేషన్‌లో టికెట్‌ చింపేసి వెళ్లిపోయాడట. అలా ఆ గండం నుంచి బతికి బయటపడ్డాడు. దానికి కారణం ఇంట్లో అమ్మ చేసిన పూజలే కారణమని తెలిపారు జగపతిబాబు. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories