Prabhas-deepika: దీపికా పదుకొనెకి బిర్యానీ పార్టీ ఇచ్చిన ప్రభాస్‌.. పది వెరైటీ వంటలతో..

Published : Dec 13, 2021, 08:49 PM ISTUpdated : Dec 13, 2021, 09:09 PM IST

గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తనతో నటించే హీరోయిన్లకి ఎంతటి రెస్పెక్ట్ ఇస్తారో తెలిసిందే. వారిని సెట్‌లో ఎంత బాగా చూసుకుంటారు. అదే సమయంలో వారికి ఇష్టమైన వంటలను రుచి చూపిస్తుంటారు. అందుకోసం స్పెషల్‌గా రెడీ చేయించడం విశేషం.   

PREV
17
Prabhas-deepika: దీపికా పదుకొనెకి బిర్యానీ పార్టీ ఇచ్చిన ప్రభాస్‌.. పది వెరైటీ వంటలతో..

తాజాగా ప్రభాస్‌(Prabhas).. గతంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌, నటి భగ్యశ్రీలకు హైదరాబాద్‌ ఫుడ్‌ తినిపించారు. ప్రత్యేకంగా వారికి మన తెలుగు వంటలు ప్రిపేర్‌ చేయించి తినిపించారు. తాజాగా ఇప్పుడు బాలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌, స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనెకి బిగ్‌ ట్రీట్‌ ఇచ్చారు. అదిరిపోయేలా వంటకాలతో ఆమెని ఖుషీ చేయించాడు డార్లింగ్‌ Prabhas. 
 

27

ప్రభాస్‌ వరుసగా బాలీవుడ్‌ భామలతో ఆడిపాడుతున్నారు. `సాహో` చిత్రంలో శ్రద్ధా కపూర్‌తో నటించాడు. `రాధేశ్యామ్‌`లో భాగ్యశ్రీ(తల్లి పాత్ర), ఇటీవల ప్రారంభమైన `ప్రాజెక్ట్ కే`లో దీపికా పదుకొనె(Deepika Padukone) కథానాయికగా నటిస్తుంది.  షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన ఈ భామలకు మన తెలుగు వంటల స్పెషాలిటీ ఏంటో చూపిస్తున్నారు ప్రభాస్‌. వారిచే టేస్ట్ చేయిస్తున్నారు. 

37

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `ప్రాజెక్ట్ కే` సినిమా రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఆర్‌ఎప్‌సీలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్‌లో ప్రభాస్‌తోపాటు Deepika Padukone  పాల్గొన్నారు. వీరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఫస్ట్ షెడ్యూల్‌ సోమవారంతో పూర్తయ్యింది. దీంతో తిరిగి ముంబయి వెళ్లిపోయింది దీపికా. 
 

47

ఈ సందర్బంగా చివరి రోజు దీపికాకి మంచి ట్రీట్‌ ఇచ్చాడు ప్రభాస్‌. ప్రత్యేకంగా పది వంటకాలను ప్రీపేర్‌ చేయించి దీపికాతోపాటు యూనిట్‌కి ట్రీట్‌ ఇచ్చారు. మన వంటలకు ఫిదా అయిన దీపికా ఆ వంటకాల ఫోటో తీసిన తన సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా ప్రభాస్‌కి, చిత్ర బృందానికి థ్యాంక్స్ చెప్పింది. ఇది మీకు తెలుసు అంటూ పేర్కొంది. 
 

57

విమానం నుంచి తీసిన మరో ఫోటోని పంచుకుంటూ మీరు మనోహరంగా ఉంటారని, మనం మళ్లీ కలుసుకునే వరకు హైదరాబాద్‌` అంటూ బై బై చెప్పింది దీపికా. ఫస్ట్ షెడ్యూల్‌ పూర్తయ్యిందని, ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌లకు థ్యాంక్స్ చెప్పింది దీపికా. అయితే ఈ విందులో పులావ్‌, హైదరాబాదీ బిర్యానీ, చికెన్‌, ఫిష్‌, నాటుకోడి పులుసు వంటి కూరలున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీపికా పంచుకున్న ఫోటో వైరల్‌ అవుతుంది. 

67

ఇక ఈ చిత్రంలో ప్రభాస్‌, దీపికా పదుకొనెతోపాటు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌గా దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు నిర్మాత అశ్వనీదత్‌. ఈ సినిమా 2023లో విడుదల కానుంది. 

77

ప్రస్తుతం ప్రభాస్‌.. `రాధేశ్యామ్‌`, `సలార్‌`, `ఆదిపురుష్‌` చిత్రాల్లో నటిస్తున్నారు. `రాధేశ్యామ్‌` విడుదలకు సిద్ధమవుతుంది. రేపు ఈ సినిమా నుంచి మరో పాట రిలీజ్‌ కాబోతుంది. మరోవైపు `ఆదిపురుష్‌` చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. అలాగే `సలార్‌` చిత్రీకరణ దశలో ఉంది. దీపికా పదుకొనె `83` ప్రమోషన్‌లో పాల్గొనబోతుంది. కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా 1983 లో ఇండియా టీమ్‌ వరల్డ్ కప్‌ గెలిచిన నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ఇది ఈ క్రిస్మస్‌కి విడుదలకాబోతుంది. దీంతోపాటు `సర్కస్‌`, `పఠాన్‌`, శకున్‌ బత్రా చిత్రంలో నటిస్తుంది.

also read: RRR: `ఆర్‌ఆర్‌ఆర్‌` దేశభక్తి సినిమా కాదా? షాకిచ్చిన రాజమౌళి.. అసలు స్టోరీ చెప్పేశాడుగా..

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories