RRR: `ఆర్‌ఆర్‌ఆర్‌` దేశభక్తి సినిమా కాదా? షాకిచ్చిన రాజమౌళి.. అసలు స్టోరీ చెప్పేశాడుగా..

First Published Dec 13, 2021, 6:41 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా గురించి ఇండియన్‌ ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న సినిమా. ఫ్రీడమ్‌ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్‌ పాత్రల నేపథ్యంలో సాగే చిత్రమిది. ఫిక్షనల్‌ కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు. లేటెస్ట్ గా అసలు కథ రివీల్‌ చేశాడు రాజమౌళి. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`ని తెరకెక్కించారు. ఇందులో అలియాభట్‌, బ్రిటీష్‌ నటి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 7న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇటీవల విడుదలైన `ఆర్‌ఆర్‌ఆర్‌` ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఎలివేషన్స్ సీన్లు అదిరిపోయేలా ఉన్నాయని `బాహుబలి`ని మించిపోయిందనే టాక్‌ వినిపించింది. 
 

ఈ సందర్భంగా ఇటీవల బ్యాక్‌ టూబ్యాక్‌ ప్రెస్‌మీట్లు నిర్వహించారు. ముంబయి, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్లు నిర్వహించింది `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అలియాభట్‌, దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య పాల్గొన్నారు. సినిమా గురించి అనేక విషయాలను వెల్లడించారు. 

అయితే ఇందులో ఫ్రీడమ్‌ ఫైటింగ్‌ గురించి, ఇద్దరు ఫ్రీడమ్‌ ఫైటర్స్ గురించి తీస్తున్న సినిమా కావడంతో అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్‌ పాత్రలను సినిమాలో ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తి నెలకొంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టోరీలోని అసలు విషయాన్ని బయటపెట్టారు రాజమౌళి. ఇటీవల హైదరాబాద్‌ ఈవెంట్‌లో ఆయన కథ గురించి చెప్పుకొచ్చారు. 
 

`ఆర్‌ఆర్‌ఆర్‌`.. దేశ భక్తి నేపథ్యంలో సాగే చిత్రం కాదని స్పష్టం చేశారు. ఫ్రీడమ్‌ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్‌ పాత్ర ప్రధానంగా సాగుతున్న నేపథ్యంలో ఇది దేశభక్తి చిత్రం కాదని, దేశభక్తి నేపథ్య డైలాగులు ఉండవని, అవి కేవలం అండర్‌ కరెంట్‌గానే ఉంటుందని, అది మెయిన్‌ పాయింట్ కాదని చెప్పారు. 
 

సినిమా ప్రధానంగా ఫ్రెండ్‌షిప్‌ నేపథ్యంలో సాగుతుందని చెప్పారు రాజమౌళి. ఇద్దరు స్నేహితుల జర్నీని, వాళ్లు కలిసి చేసిన పోరాటాన్ని ఇందులో చూపిస్తున్నట్టు తెలిపారు. `దోస్తీ` సాంగ్‌గానీ, `నాటు నాటు` పాటలో హీరోలిద్దరు కలిసి డాన్సు చేయడం కూడా వారి స్నేహాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. రియల్‌ లైఫ్‌లోనూ ఎన్టీఆర్‌, చరణ్‌ మంచి స్నేహితులని, ఆ విషయం తనకు ఫస్ట్ షాట్‌ లోనే తెలిసిందని, ఫస్ట్ షాట్‌ సందర్బంలోనే వారిద్దరు కలిసి మాట్లాడుకోవడం, సీన్స్ డిస్కషన్‌ చేసుకున్నారని, ఆ సమయంలో వారిపై తనకు నమ్మకం కలిగిందన్నారు. 

దీనిపై ఎన్టీఆర్‌ స్పందిస్తూ.. తాము `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా వల్ల ఫ్రెండ్స్ కాలేదని, అంతకు ముందే మంచి స్నేహితులమన్నారు. మేం ఫ్రెండ్స్ అయ్యాకే సినిమా వచ్చిందని చెప్పారు. తామిద్దరం ఏమాత్రం ఛాన్స్‌ దొరికినా కలిసి సినిమా గురించి మాట్లాడుకునే వాళ్లమన్నారు. 
 

రామ్‌చరణ్‌ స్పందిస్తూ, తాము ఏదో పైకి నటించే ఫ్రెండ్స్ కాదన్నారన్నారు. తమ మధ్య ఎలాంటి చిన్న చిన్న సమస్యలు, మనస్పర్థాలు నెలకొన్నా.. వాటిని పట్టించుకోమని, వాటిని దాటుకుని ముందుకు సాగితేనే ఫ్రెండ్‌షిప్‌ ఉంటుందని, మా స్నేహం అలాంటిదే అని స్పష్టం చేశారు. దీంతో `ఆర్‌ఆర్‌ఆర్‌` కథపై ఓ క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఇద్దరు లెజెండ్స్ లాంటి ఫ్రీడమ్‌ ఫైటర్స్ ని వాడుకుని రాజమౌళి వారిని స్నేహితులుగా చూపించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు.
 

click me!