Venkatesh: మహేష్, కమల్, పవన్... వెంకటేష్ తో మల్టీస్టారర్స్ చేసిన హీరోలు ఎవరో తెలుసా!

Published : Dec 13, 2021, 05:32 PM ISTUpdated : Dec 13, 2021, 05:33 PM IST

స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు వారసుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన వెంకటేష్ టాప్ స్టార్ గా ఎదిగారు. తనకంటూ ఓ ఇమేజ్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమకు నాలుగు స్థంబాలు గా నిలిచారు.    

PREV
110
Venkatesh: మహేష్, కమల్, పవన్... వెంకటేష్ తో మల్టీస్టారర్స్ చేసిన హీరోలు ఎవరో తెలుసా!

వారిలో వెంకటేష్ ది ప్రత్యేకమైన శైలి. విభిన్నమైన జోనర్స్ ట్రై చేసిన వెంకటేష్... అత్యధిక హిట్ పెర్సెంటేజ్ ఉన్న హీరోగా గుర్తింపు పొందారు. ఒక దశలు డబుల్ హ్యాట్రిక్స్ కొట్టిన ఘనత ఆయన సొంతం, ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా కథ నచ్చితే... వేరే హీరోతో స్క్రీన్ ఎంచుకోవడానికి అసలు సంకోచించరు. అందుకే ఈ తరం స్టార్స్ లో అత్యధిక మల్టీస్టారర్స్ చేసిన హీరోగా రికార్డులకు ఎక్కాడు. మరి మన వెంకీ మామ కెరీర్ లో చేసిన మల్టీస్టారర్ చిత్రాలు ఏవో చూసేయండి. 
 

210


కేవివి సత్యనారాణ దర్శకత్వంలో తెరకెక్కింది కొండపల్లి రాజా చిత్రం. వెంకీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా కొండపల్లి రాజా రికార్డులకు ఎక్కింది. ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే స్టేటస్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో సుమన్ నెగిటివ్ రోల్ చేశారు. వెంకటేష్ కెరీర్లో కొండపల్లి రాజా మొదటి మల్టీస్టారర్ గా చెప్పవచ్చు. 1993లో విడుదలైన ఈ మూవీలో హీరోయిన్ గా నగ్మా నటించారు. 

310

2005లో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి. దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సంక్రాంతి మూవీలో వెంకటేష్ తమ్ముళ్లుగా శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్ నటించారు. వెంకటేష్ కి జంటగా ఆర్తి అగర్వాల్ నటించగా.. శ్రీకాంత్ తో  స్నేహ జతకట్టారు. 

410

క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన చిత్రం ఈనాడు. కమల్ హాసన్-వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2009లో విడుదలైన ఈ ప్రయోగాత్మక చిత్రం, వెంకటేష్ నటించిన మల్టీస్టారర్స్  లో ఒకటిగా నిలిచింది. టెర్రరిస్ట్స్ పై పగతీర్చుకునే సామాన్యుడు పాత్రలో కమల్ నటించారు. పోలీస్ అధికారి పాత్రలో వెంకీ కనిపించారు. 

510

వెంకటేష్ నటించిన పూర్తి స్థాయి మల్టీస్టారర్స్ లో మొదటిది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సూపర్ స్టార్ మహేష్ (Mahesh babu) వెంకటేష్ తమ్ముడిగా నటించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ అందుకుంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరెకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టాలీవుడ్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదల కాగా  సమంత, అంజలి హీరోయిన్స్ గా నటించారు.

610

యంగ్ హీరో రామ్-వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కింది మసాలా. హిందీ మూవీ బోల్ బచ్చన్ చిత్రానికి అధికారిక రీమేక్. 2013లో విడుదలైన ఈ కామెడీ ఎంటర్టైనర్ కి కె విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. మసాలా మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. 

710

వెంకటేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో చేసిన మల్టీస్టారర్ గోపాల గోపాల. హిందీ చిత్రం ఓ మై గాడ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. 2015లో విడుదలైన గోపాల గోపాల యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో పవన్ గాడ్ శ్రీకృష్ణ రోల్ చేయడం విశేషం. 

810


మెగా హీరో వరుణ్-వెంకీ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 2. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించగా... భార్యాబాధితులుగా వెంకీ, వరుణ్ పిచ్చ కామెడీ పంచారు. 2019 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ భారీ విజయం అందుకుంది. 
 

910

ఆఫ్ స్క్రీన్ మేనల్లుడు నాగ చైతన్య వెంకీకి ఆన్ స్క్రీన్ మేనల్లుడిగా నటించిన చిత్రం వెంకీ మామ. 2019లో విడుదలైన ఈ మల్టీస్టారర్ హిట్ అందుకుంది. దర్శకుడు బాబీ తెరకెక్కించగా... రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు.

1010

ఇక ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్ 3లో కూడా వెంకీ-వరుణ్ కలిసి నటిస్తున్నారు. హీరోయిన్స్ గా మరలా తమన్నా, మెహ్రీన్ నటిచడం విశేషం. ఎఫ్ 3 వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రస్తుతానికి వెంకటేష్ నటించిన మల్టీస్టారర్స్ ఇవి.  భవిష్యత్ లో ఈ ఎవర్ గ్రీన్ హీరో మరిన్ని మల్టీస్టారర్స్ చేయాలని వెంకటేష్ బర్త్ డే (Venkatesh Birthday)సందర్భంగా కోరుకుందాం...

Also read Chiranjeevi Birthday wishes to Venkatesh: వెంకీ మామకు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్

Read more Photos on
click me!

Recommended Stories