సునామీలా ముంచేసిన ప్రభాస్ హీరోయిన్ గ్లామర్... షార్ట్స్ లో జాక్విలిన్ మైండ్ బ్లోయింగ్ ఫోటో షూట్! 

First Published | Oct 26, 2023, 9:48 AM IST

బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ గ్లామర్ షోలో బౌండరీలు బ్రేక్ చేసింది. ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ లో జాక్విలిన్ లుక్ మైండ్ బ్లాక్ చేసింది. 
 

Jacqueline Fernandez

జాక్విలిన్ ఫెర్నాండెజ్ కి ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. నటిగా పెద్దగా ప్రభావం చూపకున్నా ఆమె గ్లామర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో 68 మిలియన్స్ కి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ రేంజ్ ఏమిటో దీన్ని బట్టి చెప్పొచ్చు. 
 

Jacqueline Fernandez

శ్రీలంక దేశానికి చెందిన మోడల్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ కెరీర్ కోసం బాలీవుడ్ లో అడుగుపెట్టారు. 2009లో విడుదలైన అల్లావుద్దీన్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. మర్డర్ 2, రేస్ 2, హౌస్ ఫుల్ 2 చిత్రాలతో ఆమెకు ఫేమ్ వచ్చింది. 


Jacqueline Fernandez

కిక్ మూవీతో ఏకంగా సల్మాన్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. రవితేజ హిట్ మూవీ కిక్ రీమేక్ గా తెరకెక్కిన ఆ చిత్రం బాలీవుడ్ లో కూడా విజయం సాధించింది. ఒక ప్రక్క హీరోయిన్ గా నటిస్తూ మరో ప్రక్క స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. 

Jacqueline Fernandez

ప్రభాస్ హీరోగా విడుదలైన సాహో చిత్రంలో జాక్విలిన్ ఐటెం నెంబర్ చేసింది. ఆ సాంగ్ లో జాక్విలిన్ గ్లామర్ కుర్రాళ్లను కట్టిపడేసింది. ఈ సాంగ్ కోసం జాక్విలిన్ పెర్నాండెజ్ భారీగా ఛార్జ్ చేశారట. 
 

Jacqueline Fernandez

జాక్విలిన్ కి హరి హర వీరమల్లు మూవీలో ఛాన్స్ వచ్చింది. అనుకోని కారణాలతో ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. జాక్విలిన్ చేయను అనడంతో ఆమె స్థానంలో నోరా ఫతేహి తీసుకున్నట్లు సమాచారం. 

Jacqueline Fernandez

జాక్విలిన్ పై అనేక వివాదాలు ఉన్నాయి. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆమెను ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో ఆమెకు శిక్ష కూడా పడింది. రూ. 50000 పూచీకత్తుపై బెయిల్ తీసుకున్నారు. 

Jacqueline Fernandez

హీరో సల్మాన్ ఖాన్ తో ఎఫైర్ నడిపిన భామల్లో ఈమె కూడా ఒకరంటారు. లాక్ డౌన్ సమయంలో ప్రపంచమంతా స్తంభించి పోగా... జాక్విలిన్ సొంత దేశం వెళ్లకుండా సల్మాన్ ఖాన్ ఫార్మ్ హౌస్లో గడిపారు. 

Jacqueline Fernandez

గత ఏడాది విక్రాంత్ రోనా చిత్రంలో జాక్విలిన్ స్పెషల్ సాంగ్ చేసింది. రక్కమ్మ సాంగ్... విపరీతంగా ప్రాచుర్యం పొందింది. అలాగే సర్కస్, రామ్ సేతు, అటాక్... ఇలా అరడజను చిత్రాల వరకూ చేసింది. అవేమీ విజయం సాధించలేదు. 

Jacqueline Fernandez

అక్షయ్ కుమార్ సెల్ఫీ మూవీలో జాక్వీలిన్ కీలక రోల్ చేసింది. మలయాళ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్సు రీమేక్ గా సెల్ఫీ తెరకెక్కింది. హిందీలో వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం ఫతేహ్ టైటిల్ తో ఓ చిత్రంలో నటిస్తుంది.  నటిగా ఏమంత సక్సెస్ కాకున్నా మోడల్ గా జాక్విలిన్ కోట్లు సంపాదిస్తున్నారు. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

Latest Videos

click me!