సైడ్ యాంగిల్ లో కిక్కిచ్చేలా ‘ఢీ’ జడ్జీ ఫోజులు.. ఎల్లో గౌన్ లో కట్టిపడేస్తున్న సదా అందం

First Published | Oct 26, 2023, 8:21 AM IST

‘జయం’ హీరోయిన్ సదా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పుడూ నయా లుక్స్ లో మెరుస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా మరింత క్యూట్ గా మెరిసింది.
 

హీరోయిన్ సదా (Sada) తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే దక్కించుకుంది. టాలీవుడ్ లో ఈ బ్యూటీ చేసింది కొన్ని సినిమాలే అయినా గుర్తుండిపోయేలా చేసింది. తన అందం, నటనతో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.
 

‘జయం’తో నటిగా కెరీర్ ప్రారంభించింది. మొదటి సినిమాకే బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. అలాగే... ‘నాగా’, ‘లీల మహాల్ సెంటర్’, ‘ఔనన్నా కాదన్న’, అపరిచితుడు, వంటి చిత్రాలతో అలరించింది. ఇక తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. 
 


గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా విభిన్న పాత్రలు పోషిస్తూ వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ అలరించింది. ‘మైత్రీ’, ‘టార్చ్ లైట్’ వంటి సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది. కానీ ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. అయినా సదా నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

ఇదిలా ఉంటే.. సదా బుల్లితెరపై ‘ఢీ’ షోతోనూ అలరించిన విషయం తెలిసిందే. టీవీ ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది. స్మాల్ స్క్రీన్ పై మెరుస్తూ ఆకట్టుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ సందడి చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంటుంది. తాజాగా నయా లుక్ లో మెరిసి ఆకట్టుకుంది.

ఇటీవల అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ యంగ్ బ్యూటీలా మారిపోతోంది. తాజాగా లైట్ గ్రీన్ గౌన్ లో మెరుపులు మెరిపించింది. స్లీవ్ లెస్ అందాలతో అరగొట్టింది. అద్దంలో అందాలను సరిచూసుకుంటూ క్యూట్ గా ఫోజులిచ్చింది. సైడ్ యాంగిల్ లో స్టిల్స్ ఇస్తూ కట్టిపడేసింది.
 

సదా లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఢీజడ్జీ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక సదా ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. చివరిగా ’అహింస’ అనే చిత్రంలో మెరిసింది.
 

Latest Videos

click me!