Brahmamudi: నిజం చెప్పాలని నిర్ణయించుకున్న కావ్య.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న స్వప్న!

First Published | Oct 26, 2023, 9:36 AM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. అక్క చేసిన తప్పుని సరిదిద్దాలనుకుంటున్న ఒక చెల్లెలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

 ఎపిసోడ్ ప్రారంభంలో నిద్రపోతున్న భర్తని పాటలు పెట్టి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కావ్య. పాటలు ఉంటే నిద్ర పట్టదు ఆపు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు రాజ్. భర్త పరిస్థితికి నవ్వుకుంటుంది కావ్య. మరోవైపు కళ్యాణ్ ఎందుకు నా మనసుని అర్థం చేసుకోలేదు అని మనసులో బాధపడుతుంది అప్పు. ఇంతలో కళ్యాణ్ ఫోన్ చేసి ఇందాక నేను, అనామిక ఫోటోలు తీయించుకున్నాం కదా అవి నీకు పంపిస్తున్నాను వాటిలో బెస్ట్ పిక్స్ పంపించు ఆల్బమ్ చేయించి అనామిక కి గిఫ్ట్ ఇస్తాను అంటాడు కళ్యాణ్. చిరాకు పడుతూ నేనేమైనా నీకు అసిస్టెంట్ ని అనుకున్నావా.. నేనెందుకు ఆ పని చేయాలి అంటుంది అప్పు.
 

 ఈ మధ్య ఎందుకు నాతో మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు అంటాడు కళ్యాణ్. చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు అంటుంది అప్పు. నేను అర్థం చేసుకోలేకపోవటమా, అలాంటి సంఘటన ఇప్పుడు ఏం జరిగింది అంటాడు కళ్యాణ్. అదేమీ లేదు కానీ ఇప్పుడు నేను ఆ ఫోటోలు సెలెక్ట్ చేయలేను అంటుంది అప్పు. నువ్వు అలాగే అంటావు కానీ చేస్తావు త్వరగా సెలెక్ట్ చేసి పంపించు అని ఫోటోలు సెండ్ చేస్తాడు కళ్యాణ్.


ఫోటోలు చూస్తున్న అప్పు వాళ్ళిద్దర్నీ అలా చూసి బాధపడుతుంది. నేనెందుకు సెలెక్ట్ చేయాలి అనుకుంటూ డిలీట్ చేసేస్తే ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణమూర్తి ఎందుకు అలా డిలీట్ చేసేస్తున్నావు అతను బాధపడతాడు కదా అంటాడు. కొన్నింటి మీద ఆశపడినంత మాత్రాన దక్కవు కదా నాన్న, వదులుకోవాలి అంతే అంటుంది అప్పు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు అంటాడు కృష్ణమూర్తి.
 

నిజం చెప్పడం ఇష్టం లేక టాపిక్ మార్చేసి ఫోటోలు ఇక్కడ డిలీట్ చేసినా వాళ్ళ దగ్గర ఉంటాయి నాన్న అని చెప్పటంతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు కృష్ణమూర్తి. ఇదంతా చూస్తున్నా అప్పు పెద్దమ్మ డిలీట్ చేయవలసింది ఫోన్లో ఫోటోలు కాదు నీ మనసులో ఫీలింగ్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఇంట్లో పంతులుగారు ఉండడం, చుట్టూ అందరూ ఉండడం చూసి ఏం జరిగింది అని అడుగుతుంది రుద్రాణి.

నీ కోడలికి సీమంతం కోసం ముహూర్తం పెట్టిస్తున్నాము అంటుంది ధాన్యలక్ష్మి. పంతులుగారు శుక్రవారం సాయంత్రం బాగుంది అని చెప్తారు. ఆ మాటలు విన్న కావ్య స్వప్న వైపు కోపంగా చూస్తుంది. ఇదేంటి ఇలా చేస్తుంటే నిజం చెప్పేస్తుందేమో అనుకుంటుంది స్వప్న. ఇంత త్వరగా ముహూర్తం పెడతారు అనుకోలేదు, స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నేను ఏమీ చేయలేను అనుకుంటుంది రుద్రాణి.

చిట్టి కావ్య తో మాట్లాడుతూ మీ అక్కకి సీమంతాన్ని  నువ్వే దగ్గర ఉండి జరిపించాలి బాధ్యత అంతా నీదే అంటుంది. పండగలపుడే తన టాలెంట్ చూపించింది, ఇక అక్క సీమంతం అంటే ఊరుకుంటుందా అంతకంటే గ్రాండ్గా చేస్తుంది అంటుంది ధాన్యలక్ష్మి.  ఇంతమంది అక్క కోసం ఆలోచిస్తున్నారు వాళ్లని మోసం చేసినట్లుగా అనిపిస్తుంది ఎలాగైనా నిజం చెప్పాలి అనుకుంటూ మీతో ఒక మాట చెప్పాలి అంటుంది కావ్య.

 నిజం చెప్పేస్తుంది అని గ్రహించిన స్వప్న కావ్యని మాట్లాడివ్వకుండా నాకు చీర సెలెక్ట్ చేద్దువు గానివి పద అని చెప్పి కావ్యని చెప్పనివ్వకుండా అక్కడినుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నిజం చెప్పేస్తావా అసలే మా అత్తగారు ఎప్పుడు, ఎప్పుడు తప్పు చేస్తానా అని ఎదురుచూస్తున్నారు  అంటుంది. ఏంటి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా, అయినా సమస్య మరింత జటిలం అయితే నువ్వు ఇబ్బందుల్లో కూరుకుపోతావు.

అయినా వాళ్ళందరూ నీ మీద అంత ప్రేమ చూపిస్తుంటే ఎలా మోసం చేయాలనిపిస్తుంది అంటుంది కావ్య. అందుకే ఈ నాటకానికి ముగింపు చెప్పాలనుకుంటున్నాను, ఎలాగూ శ్రీమంతం అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతాను కదా అప్పుడు ఏదో ఒకటి చేసి అబార్షన్ అయిందని చెప్తాను అంటుంది స్వప్న. అంటే మళ్లీ ఇంకో మోసానికి తెరతీస్తున్నావా, నువ్వు మనవడిని తీసుకువస్తావని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు.

 వాళ్ళని బాధ పెట్టొద్దు ఎలాగైనా నేను ఇప్పుడు నిజం చెప్పేస్తాను అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య. నువ్వు సెంటిమెంటల్ ఫూల్ వి అక్క జీవితం పాడైపోతుందని నిజం చెప్పవు, ఆ మాత్రం చాలు నాకు అనుకుంటుంది స్వప్న. కిందికి వస్తున్న కావ్య అందరికీ నిజం చెప్పాలనుకుంటుంది కానీ వాళ్ళు స్వప్న సీమంతం ఎంత గ్రాండ్ గా చేయాలో అని మాట్లాడుకుంటూ ఉంటే చూస్తూ ఉండిపోతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Latest Videos

click me!