ప్రియుడుతో మీడియాకు దొరికిపోయిన ప్రభాస్ హీరోయిన్... శ్రద్దా బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయింది!

First Published Mar 10, 2021, 7:55 PM IST

సాహో ఫేమ్ శ్రద్దా కపూర్ లవ్ లో పడ్డట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే శ్రద్దా కపూర్ దీనిపై నోరువిప్పలేదు. తాజాగా ఆమె ప్రియుడితో కెమెరా కంటికి చిక్కడం హాట్ టాపిక్ గా మారింది. 
 

శ్రద్దా కపూర్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌ రోహన్‌ శ్రేష్ట ఎఫైర్ నడుపుతున్నారట. ఈ విషయం బాలీవుడ్ లో ఎప్పటినుండో వినిపిస్తుంది.
undefined
ఆమధ్య మాల్దీవుల్లో జరిగిన శ్రద్దా సిస్టర్ పెళ్లి వేడుకల్లో రోహాన్‌ సందడి చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  ఆ ఫోటోల నేపథ్యంలో  శ్రద్దా, రోహన్‌తో డేటింగ్ లో ఉన్నట్లు వరుస కథనాలు రావడం జరిగింది.
undefined
అయినప్పటికీ శ్రద్దా కానీ, రోహన్ కానీ తాము ప్రేమలో ఉన్నట్లు అంగీకరించలేదు.  కాగా మరోసారి జంటగా మీడియా కెమెరాలకు చిక్కారు.
undefined
ముంబైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు డిన్నర్‌ కి వెళ్లిన వీరి ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. రెస్టారెంటు నుంచి బయటకు వస్తున్న వీరిని కెమెరాలు క్లిక్ మనిపించాయి.
undefined
శ్రద్ధా బ్లాక్ అండ్ ఫాన్ షేడ్స్లో ఉన్న ప్యాంట్ షూట్‌లో ధరించగా‌, క్యాజువ‌ల్ లుక్‌లో రోహ‌న్ శ్రేష్ఠ‌ కనిపించాడు. అయితే  రోహాన్‌, శ్రద్దా ఎప్పటి నుండో మంచి మిత్రులని రోహన్ తండ్రి రాకేశ్‌ శ్రేష్ట చెప్పడం  విశేషం. కాలేజీ రోజుల నుంచే వాళ్లకు పరిచయం ఉందని ఆయన చెవుతున్నారు.
undefined
34ఏళ్ళ శ్రద్దా కపూర్ సాహో  చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ సరసన ఆమె నటిచడం జరిగింది.
undefined
click me!