సుమ 'క్యాష్' షో సీక్రెట్స్...ఇంత మోసం దాగుందా!

First Published Mar 10, 2021, 6:05 PM IST

స్టార్ యాంకర్ సుమ చాలా ఏళ్లుగా చేస్తున్న 'క్యాష్' షో చేస్తున్నారు. కేవలం సెలబ్రిటీలు పాల్గొనే ఈ షోలో లక్షల రూపాయల క్యాష్, ఖరీదైన వస్తువులు గిఫ్ట్స్ గా గెలుచుకుంటూ ఉంటారు. దొరికినంత దోచుకో అనే క్యాప్షన్ తో సాగే ఈ షో వెనకున్న సీక్రెట్స్ తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. 
 

బుల్లితెరపై నడిచే ఏ ప్రోగ్రాం నిర్వహణ అయినా... ఆదాయ వ్యయాల మీద ఆధారపడి ఉంటుంది. అధిక టీఆర్పీ రాబట్టే ప్రోగ్రామ్స్ కి ఎక్కువ ఆదాయం వస్తుంది. ప్రేక్షకుల ఆదరణ లేకపోతే టీఆర్పీ రాదు.
undefined
కాగా సుమ దాదాపు పదేళ్లుగా నడుపుతున్న క్యాష్ ప్రోగ్రాం చూస్తే ఎవరికైనా ఓ డౌట్ రాకుండా ఉండదు. అన్ని లక్షలు ప్రైజ్ మనీ, విలువైన వస్తువులు షోలో గెలుచుకున్నట్లు చూపిస్తున్నారు. అసలు ఈ షో ఒక్క ఎపిసోడ్ కి ఎంత ఆదాయం వస్తుంది.
undefined
అయితే ఆ షో వెనకున్న కొన్ని సీక్రెట్స్ తెలిస్తే.. అందులోని మ్యాజిక్ తెలుస్తుంది. మొదటిగా ఆ షోలో మనకు చూపించే కరెన్సీ నిజమైనది కాదు. ఫేక్ నోట్స్ ఉపయోగిస్తారు.

Anchor Suma

క్యాష్ షోలో చూపించినట్లు కంటెస్టెంట్స్ గెలుచుకున్న లక్షల రూపాయలు వారికి ఇవ్వరు. వాళ్లకు కేవలం ముందుగా అనుకున్న రెమ్యూనరేషన్ మాత్రమే ఇస్తారు. అందుకే లక్షలకు లక్షలు వస్తున్నా, పోతున్నా కంటెస్టెంట్స్ నిజంగా బాధపడరు, అలాగే సంతోష పడరు.
undefined
ఇక కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ సెలెబ్రిటీ ఇమేజ్ పై ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ షోలో విలువైన వస్తువులు గెలుచుకొనే అవకాశం ఉంటుంది. సరైన సమాధానం చెప్పి కంటెస్టెంట్ ఆ వస్తువుని గెలుచుకోని పక్షంలో దానిని నాశనం చేస్తారు.

Anchor Suma

మొదట మనకు చూపించేవి విలువైన బ్రాండెడ్ వస్తువులు అయినప్పటికీ... పై నుండి పడవేసే సమయంలో డూప్లికేట్ వస్తువులు వాడవచ్చు.

Anchor Suma

ఆ విధంగా క్యాష్ షోలో నిజంగా చూపించిన విధంగా లక్షలు ఖర్చు చేయరు. ఇక ఒక నెలకు సరిపడా ఎపిసోడ్స్ ఒకేసారి షూట్ చేస్తారు. సెలబ్రెటీలకు ముందుగానే ఆ ఎపిసోడ్ గురించి కొంత రిహార్సల్ ఉంటుంది.
undefined
సినిమా విడుదల సమయాలలో సదరు సినిమా హీరో, హీరోయిన్, దర్శకుడు వంటివారు వస్తారు. వాళ్ళు తమ మూవీ ప్రమోషన్ కోసం వస్తున్నారు కాబట్టి.. షో నిర్వాహకులకు ఎదురు డబ్బులు ఇచ్చే ఆస్కారం కలదు.

Anchor Suma

click me!