క్రిష్ డైరెక్షన్ లో .. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోబు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని నిర్మించిన వేదం మూవీ 2010లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎన్నో అవార్డులు గెలుచుకుంది. అయితే వేదంలో వేశ్య అనుష్క నటించబోతోందని వార్తలు రాగానే అభిమానులు, సినీ ప్రియులతో పాటు ఆమె కోస్టార్స్ కూడా షాకైపోయారు. ఎందుకంటే, అప్పటికే అనుష్క టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. అరుంధతి వంటి సినిమాతో హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది.