ప్రభాస్‌-హను మూవీలో హీరోయిన్ గా ఛాన్స్‌ .. ఎవరీ ఇమాన్వీ?

First Published | Aug 17, 2024, 5:57 PM IST

ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ ఇస్మాయిల్‌ (Iman esmail) నటిస్తోంది. ఆమె ఎవరు అనే చర్చ, సెర్చింగ్ మొదలైంది. 
 

Prabhas, Hanu , Iman Esmail


ప్రభాస్ వంటి స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అవటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్యాన్ ఇండియా రేంజిలో భారీ బడ్జెట్ లో రూపొందే సినిమాల విషయంలో ప్రతీదీ ఆచి,తూచి ముందుకు వెళ్తారు. ముఖ్యంగా హీరోయిన్, విలన్ వంటి కీ పాత్రలకు అధిక ప్రయారిటీ ఇస్తారు. అలాగే ప్రబాస్ సినిమాలో చేయాలని చాలా మందికి ఉంటుంది. కొందరికే ఆ అవకాసం వస్తుంది. అలా తాజాగా  ఇమాన్వీ  అనే అమ్మాయికి ఆఫర్ వచ్చింది. దాంతో ఆమె ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇంతకీ ఎవరి ఇమాన్వీ అని అందరూ గూగుల్ చేస్తున్నారు. అసలు ఎవరు ఈమె చూద్దాం. 

Prabhas, Hanu , Iman Esmail


 హను రాఘవపూడి సీతారామంతో బ్లాక్ బస్టర్ అందుకోవటంతో  ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో సినిమా వచ్చేలా చేసింది. ఈ సినిమాతో హను రాఘవపూడి టయర్ 1 డైరెక్టర్ల లిస్టులో చేరిపోతారు.అందుకే ప్రభాస్ తో హిట్ కొట్టి నెక్ట్స్ లెవిల్ కు వెళ్లాలనే తాపత్రయంలో ఉన్నారు. అందుకు తగ్గ కథ ఎంచుకుని ప్రభాస్ ని ఒప్పించి సినిమా చేస్తున్నారు. మరో ప్రక్క ప్రభాస్ ..యమా జోరు మీద ఉన్నారు.  ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర విజయాలతో  దూసుకుపోతన్నారు.


Prabhas, Hanu , Iman Esmail


ఈ క్రమంలో  ప్రభాస్ హీరో గా హను రాఘవపూడి దర్శకత్వంలో (PrabhasHanu) ఓ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ శనివారం ప్రారంభమైంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ ఇస్మాయిల్‌ (Iman esmail) నటిస్తోంది. 

Prabhas, Hanu , Iman Esmail

ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలో అవుతున్న వాళ్లకు ఇమాన్వీ రీల్స్‌ కొత్తేమీ కాదు. తన డ్యాన్స్‌, స్టైల్‌తో కట్టిపడేస్తుంది. హిందీతో పాటు, తెలుగు, తమిళ పాటలకూ ఆమె వేసే స్టెప్‌లు ఎంతగానో అలరిస్తాయి. అలాంటి ఇమాన్వీ ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సరసన జోడీగా నటించే అవకాశం దక్కడంతో ప్రస్తుతం సోషల్ మీడియా  వేదికగా ఇమాన్వీ పేరు ట్రెండ్‌ అవుతోంది.

Prabhas, Hanu , Iman Esmail

పీరియాడికల్‌ కథ కావడంతో  మొదటఏదైనా పాత్ర కోసం తీసుకున్నారేమో అనుకున్నారు. కానీ, ప్రభాస్‌కు జోడీగా అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో ఈ వార్త హాట్‌ టాపిక్‌ అయింది. ఇమాన్వీ వివరాల కోసం ఇంటర్నెట్‌ వేదికగా వెతకడం మొదలు పెట్టారు. ఇమాన్ ఇస్మాయిల్ 1995 అక్టోబర్ 20న దిల్లీలో పుట్టింది. చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే ఈమెకు ఎంతో ఇష్టం. అందుకే ఒక పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరో పక్క ఎంబీఏ పూర్తి చేసింది.

Prabhas, Hanu , Iman Esmail


ఫ్యామిలీ మెంబర్స్  కూడా ఆమెను ప్రోత్సహించారు. తన తండ్రి పోత్సాహం వల్లే ఉద్యోగానికి రాజీనామా చేసి, యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించించింది. ‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్‌. అండగా ఉంటాం’ ఇమాన్‌ వాళ్ల నాన్న ఆమెను ప్రోత్సహించారట. దీంతో ఫుల్‌ టైమ్‌ డ్యాన్స్‌, ఈవెంట్స్‌, డ్యాన్స్‌ షోలపై దృష్టి పెట్టి నెమ్మదిగా క్రేజ్‌ సొంతం చేసుకుంది. 

Prabhas, Hanu , Iman Esmail

సోషల్ మీడియాలో  ఆమె చేసే రీల్స్‌కు యువతలో మంచి క్రేజ్‌ఉంది.  ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రాను సుమారు 7లక్షల మంది ఫాలో అవుతున్నారు. ప్రభాస్‌తో ఛాన్స్‌ దక్కించుకోవడంతో మిలియన్‌ ఫాలోవర్స్‌ ఇక లాంఛనమ అంటున్నారు. ప్రభాస్ తో చేస్తోందంటే ఆల్ ఇండియాలో ఉన్న ప్రభాస్ అభిమానులు అందరి దృష్టీ ఆమెపై పడుతుంది. ఖచ్చితంగా ఆమె రేచ్ ఓ రేంజిలో ఉంటుంది. 
 

Hanu Raghavapudis Prabhas upcoming film announcement

ఇక ఇమాన్ కు డాన్స్ పై మంచి పట్టుంది. డ్యాన్స్‌ అంటే కేవలం శరీర భాగాలు కదపడమే కాదు, ముఖంలో హావభావాలు పలికించడం కూడా తెలియాలని అంటోంది ఇమాన్ (Iman esmail). చిన్నప్పటి నుంచే తన తల్లి కొన్ని మెళకువలు చెప్పారట. బాలీవుడ్‌ నటులు రేఖ, మాధురీ దీక్షిత్‌, వైజయంతీ మాల వంటి ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌లు నటించిన సినిమాలను చూపిస్తూ ‘వాళ్లు డ్యాన్స్‌ చేసేటప్పుడు హావభావాలను పరిశీలించు’ అని ఇమాన్‌ వాళ్ల అమ్మ చెప్పేదట. 

Prabhas, Hanu , Iman Esmail

 అలా కేవలం డ్యాన్స్‌ మాత్రమే కాదు, అందుకు తగినట్లు హావభావాలు పలికించడం నేర్చుకున్నట్లు ఇమాన్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఇక ఎప్పటికప్పుడు మ్యూజిక్‌ యాప్‌లలో కొత్తగా యాడ్‌ అయ్యే కొత్త పాటలు పదే పదే వినడం ఇమాన్‌కు అలవాటు.

Latest Videos

click me!