డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. రవితేజ హీరోగా నటించాడు. మిస్టర్ బచ్చన్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే పూర్తి స్థాయిలో మూవీ మెప్పించలేదనే టాక్ వినిపిస్తోంది. అలాగే మిస్టర్ బచ్చన్ మూవీ కొన్ని వివాదాలు సైతం రాజేసింది. ఈ చిత్రంలోని డైలాగ్స్, సీన్స్, హీరోయిన్ తో లవ్ ట్రాక్ విమర్శల పాలవుతున్నాయి.