తలసాని ముందు కన్నీరుమున్నీరైన ప్రభాస్.. ఇలా చూడలేకపోతున్నాం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

First Published Sep 11, 2022, 4:31 PM IST

రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణం రాజు మృతితో టాలీవుడ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. దాదాపు 60 ఏళ్ళకి పైగా కృష్ణం రాజు సినీ కెరీర్ కొనసాగింది.

రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణం రాజు మృతితో టాలీవుడ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. దాదాపు 60 ఏళ్ళకి పైగా కృష్ణం రాజు సినీ కెరీర్ కొనసాగింది. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణం రాజు ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 

ప్రభాస్, కృష్ణం రాజు మధ్య బంధాన్ని మాటల్లో వర్ణించలేం. యంగ్ రెబల్ స్టార్ గా తన వారసత్వాన్ని అందిపుచ్చుకుని దూసుకుపోతున్న ప్రభాస్ ని చూస్తూ కృష్ణం రాజు మురిసిపోయేవారు. కృష్ణం రాజు.. ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చే సమయంలో అన్నీ తానై చూసుకున్నారు. తనకి పెదనాన్నే ఎప్పటికి స్ఫూర్తి అని ప్రభాస్ చెబుతుంటాడు. 

కృష్ణం రాజు మృతితో ప్రభాస్ తన వెనుక ఉన్న పెద్ద దిక్కుని కోల్పోయాడు. ప్రభాస్ ముఖంలో విషాద ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంత్రి తలసాని కృష్ణం రాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభాస్ ని ఓదార్చుతో మాటామంతీ కలిపారు. ఈ సమయంలో ప్రభాస్ కన్నీరు ఆపుకోలేకపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కనిపించాడు. ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. 

ప్రభాస్ ని ఇలా చూస్తూ అభిమానులు కూడా జీర్ణించుకోలేకున్నారు. ఎప్పుడు సంతోషంగా, ఎంతో ఎనెర్జీతో ఉండే ప్రభాస్ ని ఇలాంటి విషమ పరిస్థితుల్లో చూడలేకున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్ ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు. 

కృష్ణం రాజు అంత్య క్రియలని ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్  ఇప్పటికే చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. సోమవారం రోజు కృష్ణం రాజు అంత్యక్రియలు జరగనున్నాయి. 

టాలీవుడ్ నుంచి చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇలా సినీ ప్రముఖులు అంతా కృష్ణం రాజుగారికి నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

click me!