ఇప్పటికే కృష్ణం రాజు మృతి పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా సినీ ఇండస్ట్రీ, జనసేనా అధినేతగా కృష్ణం రాజు పార్థివ దేహానికి నివాళి అర్పించారు. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుగదలకు కృష్ణం రాజు చేసిన సేవలను గుర్తు చేశారు.