ప్రభాస్ అంటేనే గొప్ప మనసు, విశాలమైన హృదయం, నిజంగానే రాజు అంటుంటారు. ఆయన మంచితనాన్ని, గొప్పతనాన్ని రకరకాలుగా వర్ణిస్తుంటారు. అన్నింటికి ఆయన అర్హులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన్ని దగ్గరుంచి చూసినవారే కాదు, బయటి నుంచి చూసిన వాళ్లు కూడా ఇదే చెబుతారు. ఎందుకంటే ఆయన అలాంటి పనులే చేస్తారు.
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో, తనని నమ్మిన వారికి సహాయం చేయడంలో, ఇచ్చిన మాట కోసం నిలబడటంతో, తన వాళ్లని తనదైన స్టయిల్‌లో సర్‌ప్రైజ్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. ఇండస్ట్రీ తరఫున ఏ సహాయం చేయాలన్నా, పై స్థాయిలో ప్రభాస్ సహాయమే ఉంటుంది. అందుకే ఇండస్ట్రీలో ఆయనది పెద్ద చేయి అంటారు.