
Ram Charan: మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన నటన, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్‌చరణ్. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ మారి పలు సూపర్ హిట్ విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దిగ్గజ హాలీవుడ్ దర్శకులు సైతం ఆర్‌ఆర్‌ఆర్‌లోని చరణ్ నటనకు ఫిదా అయ్యారు. ఇక చిరు నుంచి నటననే కాదు డ్యాన్స్‌లను కూడా తెచ్చుకున్నాడు. ఇండియాలోని బెస్ట్ డ్యాన్సర్లలో చరణ్ ఒకడుగా పేరు తెచ్చుకున్నాడు.
అలాగే తొలి చిత్రం యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘చిరుత’అప్పట్లో మంచి హిట్. మొదటి రోజే దాదాపు ఈ సినిమా రూ.4కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. సౌత్‌లో ఒక డెబ్యూ హీరోకు ఆ రేంజ్ కలెక్షన్లు రావడం టాలీవుడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సినిమా ప్రారంభానికి ముందు దాకా చిరంజీవి ఓ ప్లానింగ్ తో ఉన్నారట. అయితే చిరుత హిట్ చూసి తన నిర్ణయం మార్చుకున్నారట. ఇంతకీ చిరంజీవి ప్లాన్ ఏమిటి
వాస్తవానికి చిరుత తర్వాత రెండో సినిమాగా తన కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ 'ఖైదీ' సీక్వెల్ ని రామ్ చరణ్ తో నిర్మించి తన కొడుక్కి తన వారసత్వం అఫీషియల్ గా ఇవ్వాలనేది చిరంజీవి ఆలోచనట. అందుకోసం స్క్రిప్టు కూడా రెడీ చేయించారట. 'దాడి' అనే టైటిల్ కూడా అనుకున్నారట. అంతేకాదు తనే స్వయంగా నిర్మించాలన్న ఆలోచనకూడా చిరంజీవిలో ఉన్నట్టు అప్పట్లో చెప్పుకున్నారు.
కానీ రామ్ చరణ్ తొలి చిత్రం చిరుత పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత తేజ్ కాల్షిట్స్ కోసం కనీసం- 10మంది నిర్మాతలు ప్రయత్నించటం మొదలెట్టారు. పారితోషికం ఎంతైనా ఇస్తామంటున్నారు. చిరంజీవి ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించారు. ఇంతకుముందున్న టెన్షన్ చిరంజీవి క్యాంపులో లేదు. దాంతో ఖైదీ సీక్వెల్ చేయాలన్న ఆలోచనని వాయిదా వేసారు. నెక్ట్స్ సినిమా చిరుతను మించాలనుకున్నారు. అందుకు దగ్గ డైరక్టర్ రాజమౌళి అని డెసిషన్ కు వచ్చారు.
‘చిరుత’ తర్వాత రాజమౌళికి చెప్పి మగధీర కథను సిద్దం చేయించారు. అల్లుఅరవింద్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘మగధీర’ 2009లో విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ చిత్రంతో 75కోట్ల మార్కు అందుకున్న మొదటి హీరోగా చరణ్ రికార్డు సృష్టించాడు.
35కోట్లతో నిర్మిత మైన ఈచిత్రం 75కోట్లకు పైగా షేర్‌ను సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఎంతలా అంటే ఆ ఇమేజ్ నుంచి బయిటపడటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ చిత్రం తర్వాత వచ్చిన ‘ఆరెంజ్’ డిజాస్టర్‌గా నిలిచింది. రామ్‌చరణ్ ఈ చిత్రంలో తన ఇమేజ్‌కు భిన్నంగా లవర్‌బాయ్ పాత్రలో నటించాడు. కమర్షియల్‌గా ఈ చిత్రం ఫ్లాప్ అయినా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
ఇక ‘చిరుత’ముందు దాకా రామ్ చరణ్ లుక్స్ పరంగానూ ఒకప్పుడు తీవ్ర విమర్శలు అందుకున్నారు. అయితే పట్టుదలతో రామ్చరణ్ శరీరాకృతి మార్చుకున్నాడు. స్ఫుర ద్రూపం ఏర్పడింది. రఫెనెస్ తొలగిపోయింది. అతనిలో ఇంటర్నేషనల్ లుక్స్ కనిపిస్తున్నాయి. బ్రాడ్పిట్ ని తలపిస్తున్నాడని అనేవారు.
ఏదైమైనా తనయుడి కెరీర్ ని ఒక క్రమపద్ధ తిలో నిలపాలనే ఆలోచనే చరణ్ కు ప్లస్ అయ్యింది. ఏదైమైనా తొలి చిత్రం విడుదల తర్వాతే మలి చిత్రం ఓకే చేయాలని... మొదటి సినిమాకు వచ్చే రెస్పాన్సిని బట్టి స్ట్రాటజీ ఉంటుందని చిరంజీవి సన్నిహితులు దగ్గర చెప్పేవారట. అదే నిజమైంది. ఈ రోజు రామ్ చరణ్ కెరీర్ కు ఎదురేలేకుండా పోయింది.