ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి భారీ బిజినెస్ జరిగింది. నైజాం, ఏపీ, నార్త్, సౌత్, ఓవర్సీలో ఊహించని ఫిగర్స్ ని కోట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. నైజాం 80కోట్ల ఆఫర్ వచ్చిందట. ఇంకా బెటర్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆంధ్రలో 80కోట్లు, సీడెడ్‌లో 30కోట్లు పలుకుతుందట. ఈ లెక్కన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 180-200కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. కేవలం థియేట్రికల్ బిజినెస్ పరంగానూ ఈ సినిమా పెట్టిన బడ్జెట్‌ని దాటిపోతుంది. ఇక డిజిటల్, ఆడియో పరంగానూ డబుల్ ప్రాఫిట్‌ని పొందుతుందని తెలుస్తుంది.