అల్లుడుగారు ఇక్కడ ఎందుకు ఉంటారు అని నోరు జారతాడు చక్రపాణి. ఏమన్నారు అని ఏంజెల్ అడగటంతో బాబు గారు అన్నాను అంటూ కవర్ చేసుకుంటాడు చక్రపాణి. మీరు ఉన్నది ఇద్దరే కదా మూడు భోజనం పళ్ళాలు ఉన్నాయి ఏంటి అని అనుమానం గా అడుగుతుంది ఏంజెల్. ఆమెకి ఏదో సమాధానం చెప్తారు తండ్రి కూతుర్లు. మీ మాటలే అర్థం కాదు ఇంక మీ పనులు ఏం అర్థం అవుతాయి, అయినా రిషి వస్తానని మెసేజ్ పెట్టాడు తను వచ్చేసరికి నేను ఇంటి దగ్గర ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతుంది ఏంజెల్.