Prabhas తో రొమాన్స్ చేసిన ఏడుగురు రిచ్చెస్ట్ హీరోయిన్లు.. ఒకరి ఆస్తితో 3 సినిమాలు తీయొచ్చు

Published : Jan 18, 2026, 08:40 PM IST

ప్రభాస్‌ తో చాలా మంది హీరోయిన్లు పనిచేశారు. అందులో చాలా వరకు స్టార్‌ హీరోయిన్లుగా ఎదిగితే, మరికొందరు అడ్రస్‌ లేకుండా పోయారు. అయితే ఆయనతో రొమాన్స్ చేసిన ఏడుగురు రిచ్చెస్ట్ హీరోయిన్లు ఎవరో చూద్దాం.  

PREV
18
ప్రభాస్‌తో రొమాన్‌ చేసిన రిచ్చెస్ట్ హీరోయిన్లు

ప్రస్తుతం ఇండియాలోనే టాప్‌ హీరోల్లో ప్రభాస్‌ ఫస్ట్ ప్టేస్‌లో ఉంటారు. ఆయన ఫ్లాప్‌ మూవీ కూడా రెండు మూడు వందల కోట్లు వసూలు చేస్తుండటం విశేషం. అది ఆయన రేంజ్‌ని తెలియజేస్తుంది. ఈ కలెక్షన్లు ఇతర హీరోలకు ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్‌ బస్టర్స్ తో సమానం కావడం విశేషం. ప్రభాస్‌ తన సినిమాలతో ఎంతో మంది హీరోయిన్లకి లైఫ్‌ ఇచ్చారు. వాళ్లు స్టార్స్ గా ఎదిగారు. మరి ఆయనతో పనిచేసిన రిచ్చెస్ట్ హీరోయిన్లు ఎవరనేది తెలుసుకుందాం. 

28
నయనతార ఆస్తులివే

ప్రభాస్‌తో `మున్నా` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది నయనతార. ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది.  ఆమె ఆస్తి రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. నయనతార ఇటీవల చిరంజీవితో 'మన్ శంకర్ వర ప్రసాద్ గారు' సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. 

38
దీపికా పదుకొనె ఆస్తులు

ప్రభాస్-దీపికా పదుకొణె 'కల్కి 2898 ఏడీ' సినిమాలో కలిసి పనిచేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇండియన్‌ సినిమాలో దీపికా ఒక హాట్‌ కేక్‌లా మారింది. అలాంటి దీపిక ఆస్తులు చూస్తే, ఆమె రూ. 500 కోట్ల ఆస్తికి యజమానురాలు అని సమాచారం. ఆమె సంపదతో `ధురంధర్` లాంటి  సినిమాలు మూడు తీయొచ్చు.

48
కాజల్‌ అగర్వాల్‌ ఆస్తులు

ప్రభాస్, కాజల్ అగర్వాల్‌ కలిసి `డార్లింగ్‌`, `మిస్టర్‌ పర్‌ఫెక్ట్` చిత్రాలు చేశారు.  ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. హిట్‌ జోడీగానూ నిలిచింది.  ప్రస్తుతం చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న కాజల్‌ రూ.83 కోట్ల ఆస్తికి యజమానురాలు కావడం విశేషం. 

58
కృతిసనన్‌ ఆస్తులు

ప్రభాస్ కృతి సనన్‌తో 'ఆదిపురుష్' అనే సినిమాలో పనిచేశారు. రూ.700 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇక కృతి సంపద గురించి మాట్లాడితే, ఆమెకు రూ.90 కోట్ల ఆస్తి ఉందని సమాచారం. 

68
అనుష్క శెట్టి ఆస్తులు

ప్రభాస్, అనుష్క శెట్టి జోడీని అభిమానులు చాలా ఇష్టపడతారు. ఇద్దరూ కలిసి చాలా హిట్ సినిమాలు ఇచ్చారు. అందులో `బాహుబలి` రెండు సినిమాలు, `మిర్చి`, `బిల్లా` వంటి చిత్రాలున్నాయి. అనుష్క ఆస్తి గురించి మాట్లాడితే, ఆమె రూ. 134 కోట్లకి యజమానురాలు అని సమాచారం. 

78
తమన్నా ఆస్తులు

తమన్నా భాటియా, ప్రభాస్ చాలా హిట్ సినిమాల్లో నటించారు. `బాహుబలి` రెండు చిత్రాలు, `రెబల్‌`లో కలిసి నటించారు. వీరిద్దరి జోడీని తెరపై చూసేందుకు అభిమానులు ఇష్టపడతారు.  తమన్నా  ఇటీవల `ఆజ్‌ కీ రాత్‌` సాంగ్‌తో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆమె నర్తించిన ఈ పాట వంద కోట్ల వ్యూస్‌ని సాధించడం విశేషం. మరి తమన్నా ఆస్తులు చూస్తే, ఆమెకి రూ. 120 కోట్ల వరకు ఉంటాయని సమాచారం. 

88
త్రిష ఆస్తులు

 ప్రభాస్‌, త్రిష కూడా హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరు కలిసి `వర్షం`, `బుజ్జిగాడు`, `పౌర్ణమి` చిత్రాల్లో నటించారు.  సౌత్‌ క్రేజీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న త్రిషకి రూ. 85 కోట్ల ఆస్తులున్నాయని సమాచారం. ఈ లెక్కన దీపికా పదుకొనె రిచ్చెస్ట్ హీరోయిన్‌ గా చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories