ప్రభాస్ తో సహా.. 2023 లో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చిన ముగ్గురు స్టార్ హీరోలు..

Published : Dec 29, 2023, 02:34 PM IST

2023 కు వీడుకోలు చెప్పి.. 2024 కు వెల్ కమ్ చెప్పే టైమ్ వచ్చేసింది. ఈ ఏడాది సినిమావాళ్ళో చాలామందికి కలిసిరాకపోవచ్చు. కాని ఎన్నెఎళ్ళుగా  హిట్ కోసం ఎదరు చూస్తున్న ముగ్గరు స్టార్ హీరోలకు మాత్రం తిరుగులేని కమ్ బ్యాక్ ను అందించింది. 

PREV
110
ప్రభాస్ తో సహా.. 2023 లో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చిన ముగ్గురు స్టార్ హీరోలు..

2023 సినిమా వాళ్లకు తీపి,చేదు  జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళిపోతోంది. కాని ముగ్గరు స్టార్ సీనియర్ హీరోలకు మాత్రం తిరుగులేని కమ్ బ్యాక్ ను అందించింది. చాలా కాలంగా ప్లాప్ లతో సహవాసం చేస్తున్న ఆ స్టార్స్ కు ఈ ఏడాది సక్సెస్ నామ సంవత్సరంగా నిలిచింది. అయితే ఈ ముగ్గరు పాన్ ఇండియా స్టార్స్.. ముగ్గురికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముగ్గురు సాలిడ్ హిట్లు కొట్టారు ఈ ఏడాది.  ఇంతకీ ఆ ముగ్గరు స్టార్లు ఎవరో కాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సూపర్ స్టార్ రజినీకాంత్.. బాలీవుడ్ బాద్ షా  షారుఖ్ ఖాన్.
 

210

ఆ ముగ్గురు పాన్ ఇండియా స్టార్లు.. కోట్లలో అభిమానులు ఉన్న హీరోలు.. ప్లాప్ లు పడ్డా.. ఇమేజ్ ఏమాత్రం తగ్గని తారలు. సాలిడ్ హిట్ కోసం నాలుగైదేళ్ళు ఓపిగ్గా ఎదరు చూసిన హీరోలు. అంతే కాదు. వరుస ప్లాప్ లు వెంటాడినా.. ఏమాత్రం బెదరకుండా.. తమ ఫ్యాన్స్ కోసం అననీ భరించిన తారలు. వాళ్ళు ఆశలు ఇన్నాళ్లకు చిగురించాయి. కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయిన ఆ స్టార్లకు 2023 బాగానే కలిసొచ్చింది. ఈ ముగ్గురు స్టార్లు తమ సినిమాలతో హిట్టు కొట్టి పూర్వ వైభవం సంపాదించుకున్నారు. 
 

310

బాహుబలి సినిమాతో ప్రపంచం చూపు తనవైపు తిప్పుకున్నాడు  ప్రభాస్. తనతో పాటు..టాలీవుడ్ ను కూడా ఆ రేంజ్ లో నిలబెట్టాడు. కాని ఈసినిమా తరువాత చేసిన మూడు పాన్ ఇండియా సినిమాలు ప్రభాస్ కు నిరాశను మిగిల్చాయి. ప్రభాస్ కు  ఈశ్వర్ నుండి వరుసగా హిట్లు పడుతూ వచ్చాయి. మధ్యలో రాఘవేంద్ర, అడవి రాముడు లాంటి డిజాస్టర్లు తప్పించి.. చక్రం, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి యావరేజ్ సినిమాలు కూడా బాగా ఆడాయి.  మిర్చి సినిమా వరకూ విజయ పరంపరను కొనసాగించిన ప్రభాస్ బాహుబలితో అంతకు మించి సాధించాడు. 
 

410
Prabhas Salaar completes 6000 shows in Bengaluru city in just 7 days

బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన మూడు సినిమాలు దబ్బతీశాయి.  సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ సినిమాలు భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీస్ గా వచ్చినా.. ప్రభాస్ ను గట్టిగా నిరాశపరిచాయి. అయితే దాదాపు 6ఏళ్ళుగా హిట్ కోసం చూస్తున్న ప్రభాస్ కు సలార్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అయ్యింది.  ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ డిసెంబర్ 22 న థియేటర్లలోకి వచ్చింది. ప్రభాస్‌ కు తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చింది.వసూళ్ళ వరద పారిస్తోంది. ఇదే ఊపు నెక్ట్స్ ఇయర్ కూడా ఉంటే.. ప్రభాస్ వైభవం మళ్లీ స్టార్ట్ అయినట్టే.

510

ఇక తమిళ తలైవా... సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈమధ్య బాగా స్ట్రగుల్అయ్యారు. వరుసగా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో.. చాలా ఇబ్బంది ఫీల్అయ్యారు. కాని సినిమాలు చేయడం మాత్రం మానలేదు రజినీకాంత్. యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ.. మంచి మంచి కాన్సెప్ట్ లు తీసుకుంటూ వెళ్ళాడు.  50 సంవత్సరాల సినీ కెరియర్‌లో తమిళ, హిందీ, కన్నడ, తెలుగు, బెంగాలీ భాషల్లో 169 పైగా సినిమాలు చేసిన రజినీకాంత్.. ఈ మూడు నాలుగేళ్లలో పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. 
 

610

రోబో  సినిమా హిట్ తరువాత రజినీకాంత్ రేంజ్ లో మరే హిట్ పడలేదు. రోబోకు  సీక్వెల్ గా 2018లో వచ్చిన 2.0 పైసలు వసూలు చేసినా.. రజనీకాంత్‌కి పెద్దగా హిట్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత చేసిన మరో 3 సినిమాలు అదే రిజల్ట్ ను అందించాయి. కబాలీ కాస్త ఆడినా.. ఆతరువాత వచ్చిన పేటా, కాలా, దర్భార్ లాంటి సినిమాలు నిరాశనుమిగిల్చాయి. ఇక రజనీకాంత్ కి దాదాపు 5 సంవత్సరాల తర్వాత 2023 కలిసొచ్చిందనే చెప్పాలి. జైలర్ సినిమా  బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. ఫ్యాన్ స్ దిల్ కుష్ అయ్యారు. 
 

710

ఈ సినిమా హిట్ అవ్వడం కాదు.. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సూపర్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సాధించింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈసినిమా దాదాపు  600 కోట్ల వసూలు చేసి రజనీకాంత్ కి మంచి కంబ్యాక్ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమా కోసం రజనీకాంత్ 210 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుని ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రజనీకాంత్ గుర్తింపు పొందారు. మొదటి 100 కోట్లు తీసుకోగా.. సినిమా వసూళ్ళు చూసి నిర్మాత మరో వందకోట్లు ఇచ్చినట్టు సమాచారం. 
 

810
पठान और जवान के हिट होने के बाद SHAHRUKH KHAN ने बढ़ाई अपनी फीस

ఇక బాలీవుడ్  తెరపై మెరుపులు మెరిపించి.. నార్త్ సినిమాను ఏలిన బాద్ షా ఆఫ్ బాలీవుడ్ షారుఖ్ ఖాన్. సీరియల్ నటుడుగా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోగా మారి..బాలీవుడ్ ను ఊపు ఊపి వదిలిపెట్టాడు. అటువంటిది.. ఆయన కూడా వరుసగా ప్లాప్ లతో. డీలా పడ్డాడు.  మరీ ముఖ్యంగా 2013 లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ తరువాత షారుఖ్‌కి మంచి హిట్ పడలేదని చెప్పాలి.  2018 లో వచ్చిన జీరో సినిమా తరువాత  షారుఖ్ కు మరింత విరక్తి వచ్చింది. దాంతో సినిమాలకు అప్పటి నుంచి కాస్త దూరంగా ఉన్నాడు. అయితే షారుఖ్ ఫ్యాన్స్ భయపడ్డారు. మళ్ళీ అతను నటిస్తాడా లేదా అని. కాని ఆతరువాత జెట్ స్పీడ్ తో తరిగి వచ్చారు. 

910

సరిగ్గా అదే టైమ్ లో బాలీవుడ్ పూర్తిగా పడిపోయి ఉంది. టాలీవుడ్ సినిమాల ప్రభావంతో బాలీవుడ్ తెల్లముఖం వేయడంతో.. సరిగ్గా అదే టైమ్ లోపఠాన్ సినిమాతో వచ్చి అద్భుతమైన రీ ఎంట్రీ ఇచ్చిన షారుఖ్.. అటు బాలీవుడ్ ను కూడా కాపాడాడు. వెయ్యికోట్ల సినిమాతో ప్యాన్స్ కు పండగ చేశాడు. 

1010

 తరువాత సరిగ్గా 9 సంవత్సరాల తర్వాత 2023 లో షారుఖ్ పఠాన్, జవాన్‌ లతో తన కెరియర్ సెట్ చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు అత్యథిక వసూళ్లు రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. 2023 చివర్లో విడుదలైన డంకీ ‘షారుఖ్‌కి మంచి కంబ్యాక్ ఇవ్వడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇలా ఈ సూపర్ స్టార్లు 2023 లో తమ కెరియర్లో తిరిగి హిట్లు అందుకుని దూసుకుపోతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories