ఓటిటిలో 'మంగళవారం', అందరి చూపు దివ్య పిళ్ళై పైనే..నెగిటివ్ రోల్ తో దెబ్బకు ఫేమస్ అయిపోయిందిగా

Published : Dec 29, 2023, 02:12 PM IST

ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్ పుత్, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్ లో వచ్చిన మంగళవారం చిత్రం మంచి విజయం సాధించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని ఈ మూవీ అలరించింది.

PREV
16
ఓటిటిలో 'మంగళవారం', అందరి చూపు దివ్య పిళ్ళై పైనే..నెగిటివ్ రోల్ తో దెబ్బకు ఫేమస్ అయిపోయిందిగా

ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్ పుత్, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్ లో వచ్చిన మంగళవారం చిత్రం మంచి విజయం సాధించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని ఈ మూవీ అలరించింది. పాయల్ రాజ్ పుత్ బోల్డ్ అండ్ ఎమోషనల్ పెర్ఫామెన్స్, అజయ్ భూపతి మిస్టరీ అంశాలతో చేసిన మ్యాజిక్ ఈ చిత్రంలో హైలైట్. 

26

పల్లెటూరిలో జరిగే అక్రమ సంబంధాల నేపథ్యంలో అజయ్ భూపతి ఈ చిత్ర కథ రాసుకున్నారు. దీనికి కొన్ని మిస్టరీ ఎలిమెంట్స్ జోడించారు. ఫలితంగా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ చిత్రం రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి వచ్చేసింది. ఓటిటిలో మంగళవారం చిత్రానికి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తోంది అని చెప్పొచ్చు. 

36

 మంగళవారం చిత్రంలో  పాయల్ రాజ్ పుత్ తో పాటు ఈ చిత్రంలో యువతని ఆకర్షిస్తున్న మరో బ్యూటీ దివ్య పిళ్ళై. ఈ మూవీ ఓటిటిలో రిలీజైనప్పటికీ నుంచి ఎవరు ఈ దివ్య పిళ్ళై అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు. దెబ్బతో ఈ బ్యూటీ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. మలయాళీ నటి అయిన దివ్య పిళ్ళై2015 నుంచి సినిమాలు చేస్తోంది. 

46

కొన్ని చిత్రాలు మంచి గుర్తింపు నిచ్చాయి. అయితే ఈ రేంజ్ లో హాట్ టాపిక్ అయ్యే విధంగా ఆమెకి పాత్ర పడలేదు. దివ్య పిళ్ళై మంగళవారం చిత్రంలో జమీందారు భార్యగా కట్టుబాట్లు సంప్రదాయాలు పాటించే పద్ధతైన మహిళగా నటించి ఆకట్టుకుంది. అయితే క్లైమాక్స్ లో ఆమె పాత్రలో ఉండే ట్విస్ట్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. నెగిటివ్ రోల్ లో నటించి షాకిచ్చింది. 

56

మంగళవారం చిత్రం విజయం సాధించడంలో దివ్య పిళ్ళై పోషించిన పాత్ర కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ప్రస్తుతం నెటిజన్లంతా ఆమె ఫోటోలు ట్రెండ్ చేస్తున్నారు. రీసెంట్ గా దివ్య పిళ్ళై ది విలేజ్ అనే వెబ్ సిరీస్ లో సైతం నటించింది. 

66

దివ్య పిళ్ళై సోషల్ మీడియాలో ఎంతో అందమైన ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళని మాయ చేస్తోంది. మంగళవారం తర్వాత ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

click me!

Recommended Stories