SalaarReview:సలార్ ప్రీమియర్ షో రివ్యూ..ప్రభాస్ ర్యాంపేజ్ మోడ్, ఇంటర్వెల్ బ్లాక్ లో నాన్ స్టాప్ గూస్ బంప్స్

First Published Dec 22, 2023, 3:50 AM IST

ప్రశాంత్ నీల్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య బలమైన స్నేహ బంధాన్ని చూపిస్తూ కళ్ళు చెదిరే విజువల్స్ తో ఈ చిత్రాన్ని యాక్షన్ డ్రామాగా మలిచారు. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ హంగామా మొదలైపోయింది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా థియేటర్లు హోరెత్తే జాతర షురూ అయింది. వరల్డ్ వైడ్ గా సలార్ మూవీ ప్రీమియర్ షోలు ప్రారంభం కావడంతో ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. ప్రశాంత్ నీల్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య బలమైన స్నేహ బంధాన్ని చూపిస్తూ కళ్ళు చెదిరే విజువల్స్ తో ఈ చిత్రాన్ని యాక్షన్ డ్రామాగా మలిచారు. 

వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ షోలు ప్రారంభం కావడంతో సినిమా విశేషాలు వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకుల నుంచి సలార్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. చిన్న పిల్లల మధ్య ఫ్రెండ్ షిప్ సన్నివేశాలతో సలార్ చిత్రం నెమ్మదిగా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత సూరీడే గొడుగుపట్టి అనే సాంగ్ వస్తుంది. దాదాపు 15 నిమిషాల తర్వాత ప్రభాస్ సింపుల్ ఎంట్రీ తో అదరగొట్టేశాడు. 

Latest Videos


మొదటి 45 నిమిషాల పాటు ఒక మిస్టరీ ఎలిమెంట్ తో సినిమా రన్ అవుతూ ఉంటుంది. శృతి హాసన్ కి సంబంధించిన మిస్టరీ అది. ప్రీ ఇంటర్వెల్ ముందు వరకు తుఫాను ముందు ప్రశాంతత లా ఉంటుంది వ్యవహారం. కానీ ప్రీ ఇంటర్వెల్ ఫైట్ నుంచి ప్రభాస్ మోస్ట్ వయలెంట్ మాన్ గా మారిపోతాడు. ఇంటర్వెల్ కి ముందు పృథ్వీ రాజ్ సుకుమారన్ ఎంట్రీ తర్వాత సినిమా స్వరూపమే మారిపోతుంది. అనేక ట్విస్టులతో ఆడియన్స్ ఒక్కసారిగా సీట్ ఎడ్జ్ మీదకి వచ్చేస్తారు. 

యాక్షన్ ఎపిసోడ్ లో అయితే ప్రభాస్ ఊచకోత మామూలుగా ఉండదు. 20 నిమిషాలపాటు థియేటర్ దడదడలాడిపోతుంది. ప్రశాంత్ నీల్ కరెక్ట్ టైంలో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అన్ని ఎలిమెంట్స్ వదిలిపెట్టాడు. సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ ఒక మాన్స్టర్ లాగా కనిపించడం ఖాయం. 

అయితే కొన్ని ఎలివేషన్స్ కేజిఎఫ్ లో తలపించేలా ఉండడం చిన్న మైనస్ అని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ కూడా అదే టెంపోలో వెళుతుంది మూవీ. సెకండ్ హాఫ్ లో ఒక ట్రైబల్ గర్ల్ ని కాపాడే యాక్షన్ ఎపిసోడ్ ని ప్రశాంత్ నీల్ అద్భుతంగా డిజైన్ చేశారు. 

సెకండ్ హాఫ్ లెన్తీగా సాగినప్పటికీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. కొన్ని చోట్ల డ్రామా సాగదీసినప్పటికీ ఈశ్వరి రావు సన్నివేశాలు.. ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్ మధ్య సీన్స్ కట్టిపడేస్తాయి. 

ప్రభాస్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ ఫ్యాన్స్ కోరుకునే అంశాలని ప్రశాంత్ నీల్ డెలివర్ చేశారు. యాక్షన్ ఎలివేషన్ సన్నివేశాల్లో ఆడియన్స్ సీట్స్ ఎడ్జ్ పైకి వచ్చేలా బ్యాగ్రౌండ్ సంగీతం ఉంటుంది. డైలాగులు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో కథ పకడ్బందీగా సాగుతుంది. ఖాన్సార్ లో రక్తం ఏరులై పారుతుంది. ఓవరాల్ గా సలార్ చిత్రం గురించి చెప్పాలంటే బాక్సాఫీస్ వద్ద చాలా రికార్డులు డేంజర్ లో పడ్డట్లే అని చెప్పొచ్చు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునేటట్లు సరైన మూవీ పడింది. 

click me!