Salaar:'సలార్' మూవీ చూడడానికి 5 కారణాలు.. బాహుబలి తర్వాత ఫస్ట్ హిట్ కోసం..

First Published | Dec 21, 2023, 9:59 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ తొలి షో మరికొన్ని గంటల్లో మొదలు కాబోతోంది. చిత్ర యూనిట్ తో పాటు అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఈ చిత్రంపై ఉత్కంఠ నెలకొంది.

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ తొలి షో మరికొన్ని గంటల్లో మొదలు కాబోతోంది. చిత్ర యూనిట్ తో పాటు అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఈ చిత్రంపై ఉత్కంఠ నెలకొంది. కెజిఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తో రచ్చ రచ్చ చేసిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఆల్రెడీ ట్రైలర్ లో సలార్ మూవీ బీభత్సాన్ని శాంపిల్ చూపించారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో సలార్ చిత్రం నయా రికార్డులు సృష్టిస్తోంది. సలార్ చిత్రంలో ఆకర్షిస్తున్న అంశాలు ఏంటి, ఈ చిత్రం చూడడానికి 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

ప్రభాస్ : ఈ చిత్రం చూడడానికి మొదటి కారణం సెకండ్ థాట్ లేకుండా ప్రభాస్ అనే చెప్పొచ్చు. పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ ఏ స్థాయిలో అభిమానులని సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సలార్ ట్రైలర్ లో ప్రభాస్ ని చూస్తుంటే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ప్రభాస్ ని ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూద్దామా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. 


ప్రశాంత్ నీల్ : ఇక రెండవ కారణం గురించి చెప్పుకోవాలంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వం అని చెప్పొచ్చు. కెజిఎఫ్ చిత్రంతో ప్రశాంత్ నీల్ హీరో ఎలివేషన్స్ కి కొత్త అర్థం తీసుకువచ్చారు. కెజిఎఫ్ లో కన్నడ ఫ్యాన్స్ తప్ప దాదాపుగా మిగిలిన ఆడియన్స్ యష్ తో చూడడం అదే తొలిసారి కావచ్చు. కానీ ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేసిన విధానానికి గూస్ బంప్స్ వచ్చాయి. అలాంటిది పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్స్ ఎలా ఉంటాయో ఊహించుకుంటుంటేనే ఆసక్తి పెరిగిపోతోంది. 

ఫ్రెండ్ షిప్ : ఈ చిత్రం ప్రధానంగా ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథగా ఖాన్సార్ అనే సిటీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. ట్రైలర్స్ లో ప్రశాంత్ నీల్ పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్ మధ్య ఫ్రెండ్ షిప్ నే హైలైట్ చేశారు. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి అందరిలో ఉంది. 

యాక్షన్ : ఇక సలార్ చిత్రంలో యాక్షన్ సీన్స్ గురించి కూడా అదిరిపోయే లీకులు వస్తున్నాయి. మొత్తం ఐదు ఫైట్స్ ఉంటాయట. ఒక్కఒక్క ఫైట్ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని.. వయెలెన్స్ లెవల్ ఊహించలేని విధంగా ఉంటుందని అంటున్నారు. ఇక భారీ సెట్స్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. 

బాహుబలి తర్వాత : ఇదిలా ఉండగా ప్రభాస్ అభిమానులంతా ఎదురుచూస్తోంది బాహుబలి తర్వాత ఆ స్థాయి విజయం ఎప్పుడు దక్కుతుందా అని. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీ అంటే ఇదే అని చెప్పొచ్చు. సాహు స్టైలిష్ గా సాగే చిత్రం. ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ జాతకాలు, ప్రేమ నేపథ్యంలో ఉంటుంది. ఆదిపురుష్ పౌరాణిక చిత్రం. కానీ ఏ చిత్రమూ విజయం సాధించలేదు. దీనితో సలార్ ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. 

Latest Videos

click me!