ప్రభాస్ కి ఇష్టమైన పవన్ కళ్యాణ్ పాట.. ఫ్రెండ్స్ తో పార్టీలో కూడా అదే సాంగ్, అందులో ఉన్న అర్థానికి ఫిదా 

First Published | Nov 11, 2024, 11:09 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ప్రభాస్ కి మంచి రిలేషన్ ఉంది. ఓ ఇంటర్వ్యూలో తనకి విపరీతంగా ఇష్టమైన సాంగ్ గురించి వివరించారు. ప్రభాస్ కి ఇష్టమైన సాంగ్ తన సినిమాలోది కాదు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ చిత్రాల లైనప్ భారీగా ఉంది. స్పిరిట్, ఫౌజి, సలార్ 2, కల్కి 2 ఇలా భారీ బడ్జెట్ చిత్రాలని ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ హోంబాలే ఫిలిమ్స్ తో మూడు చిత్రాలకు భారీ డీల్ సెట్ చేసుకున్నారు. ప్రభాస్ రియల్ లైఫ్ లో ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటారు. 

దాదాపుగా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ప్రభాస్ కి మంచి రిలేషన్ ఉంది. ఓ ఇంటర్వ్యూలో తనకి విపరీతంగా ఇష్టమైన సాంగ్ గురించి వివరించారు. ప్రభాస్ కి ఇష్టమైన సాంగ్ తన సినిమాలోది కాదు. పవన్ కళ్యాణ్ జల్సా చిత్రంలోని ఓ సాంగ్ అంటే ప్రభాస్ కి విపరీతమైన ఇష్టం, క్రేజ్ అట. సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి చర్చించుకుంటున్న సందర్భంలో జల్సా చిత్రంలో ఆయన రాసిన పాట గురించి ప్రభాస్ ప్రస్తావించారు. 


తాళ్ళపాక అన్నమాచార్యులు రాసిన సంకీర్తనల్లో బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే చాలా పాపులర్ అయింది. మనుషులంతా ఒక్కటే అని వివరించేలా ఆ సంకీర్తన ఉంటుంది. అదే తరహాలో జల్సా చిత్రంలో సిరివెన్నెల చలోరే చలోరే ఛల్ అనే సాంగ్ రాశారు. యువతకి నచ్చేలా హుషారుగా పాట ఉంటూనే డీప్ మీనింగ్ తో ఉంటుంది. 

ప్రభాస్ ఈ సాంగ్ గురించి చెబుతూ.. జల్సా చిత్రంలోని చలోరే చలోరే ఛల్ సాంగ్ అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు, పార్టీ చేసుకుంటునప్పుడు తప్పనిసరిగా ఆ సాంగ్ పెడతా. స్ సాంగ్ మీనింగ్ ని ఫ్రెండ్స్ కి వివరిస్తూ వాళ్ళని విసిగించేస్తా. కొన్ని సార్లు నేను ఆ సాంగ్ పెడితే వామ్మో వీడు మళ్ళీ చలోరే చలోరే సాంగ్ స్టార్ట్ చేశాడు అని ఫ్రెండ్స్ పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

సాంగ్ వినడానికి హుషారెత్తించే బీట్ తో పెప్పీగా ఉంటుంది. కానీ మీనింగ్ మాత్రం చాలా డీప్ గా ఉంటుంది. 'నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా.. నీ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా.. వీరులకీ దీనులకి అమ్మ ఒడి ఒక్కటే.. వీరులకి చోరులకీ కంట తడి ఒక్కటే లాంటి లైన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. 

Latest Videos

click me!