నేను ఎప్పుడైనా బాధలో ఉంటే చరణ్ అన్న వెంటనే ఫోన్ చేస్తాడు. చరణ్ అన్న ఒక్క మాట చెబితే చాలు ఎనెర్జీ తిరిగి వస్తుంది. ప్రతి ఈవెంట్ లో చరణ్ అన్న గురించి, బాబాయ్ గురించి, పెదనాన్న గురించి మాట్లాడుతున్నాను. కొందరు వరుణ్ తేజ్ ఎందుకు లా ప్రతి సారి వాళ్ళ గురించి మాట్లాడతాడు అని అనుకోవచ్చు. నేను కచ్చితంగా వాళ్ళ గురించి మాట్లాడతా ఎందుకంటే వాళ్ళు నా ఫ్యామిలీ.