తక్కువ టైంలోనే అత్యధిక నంది అవార్డులు గెలుచుకున్న హీరో..మహేష్ కెరీర్ బెస్ట్ మూవీకి మాత్రం మొండిచేయి

First Published | Oct 19, 2024, 2:04 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజకుమారుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి మహేష్ బాబు హవా మొదలయింది. ఒక్కడు చిత్రంతో మహేష్ బాబు స్టార్ హీరో అయ్యారు. మహేష్ బాబుకి టాలీవుడ్ ఒక రేర్ రికార్డ్ ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజకుమారుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి మహేష్ బాబు హవా మొదలయింది. ఒక్కడు చిత్రంతో మహేష్ బాబు స్టార్ హీరో అయ్యారు. మహేష్ బాబుకి టాలీవుడ్ ఒక రేర్ రికార్డ్ ఉంది. అదేంటంటే తక్కువ టైంలో అత్యధిక నంది అవార్డులు గెలుచుకున్న హీరో మహేష్ బాబు. 

మహేష్ బాబు ఇప్పటి వరకు 28 చిత్రాల్లో నటించారు. 29 వ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో ఉంది. కేవలం 28 చిత్రాలకే మహెష్ బాబు ఏకంగా 9 నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఈ ఘనత మరెవ్వరికీ సాధ్యం కాలేదు. మహేష్ బాబు నంది అవార్డులు గెలుచుకున్న చిత్రాలని ఒక సారి గమనిద్దాం. 


Mahesh Babu

తొలి చిత్రం రాజకుమారుడుకి బెస్ట్ డెబ్యూ హీరోగా మహేష్ నంది అవార్డు అందుకున్నారు. టక్కరి దొంగ చిత్రానికి స్పెషల్జ్యూరీ నంది అవార్డు అందుకున్నారు. మురారి, అర్జున్, నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు చిత్రాలకు ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. శ్రీమంతుడు చిత్రానికి ఉత్తమ కో ప్రొడ్యూసర్ గా కూడా మహేష్ కి మరో నంది అవార్డు దక్కింది. 

Mahesh Babu

ఆశ్చర్యకర విషయం ఏంటంటే మహేష్ బాబు కెరీర్ ని పూర్తిగా మార్చేస్తూ స్టార్ నుంచి సూపర్ స్టార్ గా మార్చిన చిత్రం పోకిరి. పోకిరి చిత్రానికి మాత్రం మహేష్ కి నంది అవార్డు రాలేదు. ఇతర విభాగాల్లో దర్శకుడికి, ఫైట్ మాస్టర్స్ కి నంది అవార్డులు లభించాయి కానీ మహేష్ కి మాత్రం అవార్డు రాలేదు. మహేష్ బాబు భవిష్యత్తులో ఎన్ని చిత్రాలు చేసినా పోకిరి మాత్రం ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. దూకుడు చిత్రం సూపర్ హిట్. అది ఫక్తు కమర్షియల్ ఎంటర్టైనర్. అలాంటి చిత్రానికి ఉత్తమ నటుడిగా మహేష్ కి నంది అవార్డు వచ్చింది. పోకిరి ఏం పాపం చేసింది అని చాలా మంది ఇప్పటికీ ప్రశ్నిస్తుంటారు. 

ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో మాత్రం మహేష్ బాబు పోకిరి చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. త్వరలో రాజమౌళితో అంతర్జాతీయ స్థాయిలో భారీ చిత్రంలో మహేష్ నటించబోతున్నాడు. ఈ చిత్రంతో మహేష్, రాజమౌళి ఆస్కార్ అవార్డ్స్ పై కన్నేస్తారేమో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. 

Latest Videos

click me!